యువ సర్జన్ల నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా..బెజవాడ ఎసిటాబులం కోర్స్

- July 27, 2025 , by Maagulf
యువ సర్జన్ల నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా..బెజవాడ ఎసిటాబులం కోర్స్

విజయవాడ: యువ సర్జన్ల నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా నిర్వహించిన బెజవాడ ఎసిటాబులం కోర్స్ అత్యంత విజయవంతంగా జరిగింది. విజయవాడ ఆర్థోపెడిక్ సొసైటీ (VOS) సౌజన్యంతో ఏర్పాటు చేయబడిన ఈ జాతీయ స్థాయి వైద్య సదస్సులో వివిధ రాష్ట్రాలకు చెందిన వైద్య ప్రముఖులు ప్రతినిధులుగా హాజరయ్యారు. దాదాపు 200 మంది యువ వైద్యులు, పీజీ వైద్య విద్యార్థులు సదస్సుకు హాజరై శస్త్రచికిత్సా నైపుణ్యాన్ని సముపార్జించుకున్నారు.ఈ సదస్సులో పలు అంశాలపై వర్క్ షాపులు, లైవ్ ప్రజెంటేషన్లు నిర్వహించారు. తుంటి కీలు శస్త్ర చికిత్సలు, అత్యాధునిక చికిత్సా విధానాలపై పలువురు వైద్య నిపుణులు ప్రసంగించారు. ప్రసంగాల అనంతరం, ఆయా అంశాలపై సదస్సుకు హాజరైన వారి సందేహాలను నివృత్తి చేశారు. బెజవాడ ఎసిటాబులం కోర్స్ ఆర్గనైజింగ్ చైర్మన్, ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ బెజవాడ పాపారావు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఆధునిక శస్త్రచికిత్సా నైపుణ్య సాధనకు యువ వైద్యులకు ఇదో మహత్తర అవకాశమని అన్నారు. గత పదేళ్లుగా ఈ సదస్సులను నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు. బెజవాడ ఎసిటాబులం కోర్స్ విజయవంతంగా నిర్వహించడం పట్ల ఆయన సంతోషం వెలిబుచ్చారు.యువ సర్జన్లకు, భవిష్యత్ వైద్యులకు ఆధునిక శస్త్ర చికిత్సా నైపుణ్యాన్ని అందించడం ద్వారా ప్రజలందరికీ మెరుగైన వైద్య చికిత్సలు చేరువవుతాయని డాక్టర్ బెజవాడ పాపారావు పేర్కొన్నారు.ఈ సదస్సులో విజయవాడ ఆర్థోపెడిక్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ ఎంజే నాయుడు, సెక్రటరీ డాక్టర్ కర్లపూడి వాసు, డాక్టర్ హరిశర్మ (హైదరాబాద్), డాక్టర్ కాషా శ్రీనివాస్ (హైదరాబాద్), డాక్టర్ అతుల్ పాటిల్ (పూణే), డాక్టర్ సునీల్ గవాస్కర్ (చెన్నై) తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com