నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరైన సీఎం రేవంత్
- July 27, 2025
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో హాజరయ్యారు. గతంలో టీపీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో నమోదైన రెండు కేసులపై ఈరోజు విచారణ జరిగింది.కోర్టు ముందు విచారణ జరిగిన నేపథ్యంలో, రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా కోర్టుకు వచ్చి హాజరయ్యారు.ఈ కేసులు 2021లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనలు, నిరసనల సమయంలో నమోదయ్యాయి.అప్పట్లో ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేస్తూ కాంగ్రెస్ నేతలు నిర్వహించిన ర్యాలీలకు సంబంధించి రేవంత్ రెడ్డి పై పోలీసులు కేసులు నమోదు చేశారు.వాటిలో ట్రాఫిక్ కు ఆటంకం కలిగించడము, పబ్లిక్ ఆర్డర్ భంగం, అనుమతి లేకుండా బహిరంగ సభలు నిర్వహించడంపై నిబంధనల ఉల్లంఘన వంటి ఆరోపణలు ఉన్నాయి.
నాంపల్లి కోర్టు ముందు ఈ రెండు కేసులపై వాదనలు వినిపించాయి.ప్రభుత్వ వాదనలతో పాటు, రేవంత్ తరఫు న్యాయవాదులు కూడా తమ వాదనలు సమర్పించారు.ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం, కోర్టు కేసును ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది.తదుపరి విచారణలో మరిన్ని ఆధారాలు సమర్పించే అవకాశం ఉందని సమాచారం.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







