కువైట్ లో భారీగా తగ్గిన అంబులెన్స్ కాల్స్..!!

- July 27, 2025 , by Maagulf
కువైట్ లో భారీగా తగ్గిన అంబులెన్స్ కాల్స్..!!

కువైట్: గత రెండు నెలల్లో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన అంబులెన్స్ కాల్స్ భారీగా తగ్గినట్టు మంత్రిత్వ శాఖ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా అల్-సనద్ పేర్కొన్నారు. దాదాపు 357 కేసులు తగ్గాయని వెల్లడించారు. "రాబోయే రోజుల్లో మరింత మెరుగైన ఫలితాల కోసం మేము ఎదురుచూస్తున్నాము" అని డాక్టర్ అల్-సనద్ "X" ప్లాట్‌ఫామ్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.

కువైట్ లో రోడ్డు భద్రతను అప్డేట్ చేయడం, ప్రమాద సంబంధిత గాయాలను తగ్గించడం, కొత్తగా అమలు చేయబడిన ట్రాఫిక్ నిబంధనల సానుకూల ప్రారంభ ప్రభావాన్ని ఈ ప్రకటన హైలైట్ చేస్తుందని నిపుణులు అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com