జులై 28తో ముగియనున్న IBPS దరఖాస్తుల కరెక్షన్‌ విండో

- July 28, 2025 , by Maagulf
జులై 28తో ముగియనున్న IBPS దరఖాస్తుల కరెక్షన్‌ విండో

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) ప్రొబేషనరీ ఆఫీసర్స్‌/ మేనేజ్‌మెంట్ ట్రైనీస్‌(PO/MT), స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీ కోసం ఇటీవల నోటిఫికేషన్ విడుదల  చేసిన విషయం తెలిసిందే. మొత్తం 6,125 పోస్టుల భర్తీ కోసం విడుదలైన ఈ నోటిఫికేషన్‌ సంబంధించి దరఖాస్తుల స్వీకరణ జులై 28తో ముగియనుంది.ఇప్పటికే చాలా మంది ఈ పోస్టుల కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నారు.

అయితే, దరఖాస్తు చేసుకున్న ఫారమ్ లో ఏమైనా తప్పులు ఉంటే సవరించుకోవడం కోసం కరెక్షన్ విండో సదుపాయాన్ని కలిపిస్తారు. ఈ సేవలు జులై 31వ తేదీ నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు అందుబాటులో ఉండనున్నాయి. కాబట్టి, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏమైనా తప్పులు ఉంటే తప్పకుండా ఈ సేవలను వినియోగించుకోవాలి. ఎందుకంటే, అప్లికేషన్ ఫారం లో ఎంటర్ చేసిన వివరాలల్లో చిన్న తప్పులు ఉన్నా ఆ ఫారం రిజెక్ట్ చేయబడుతుంది. కాబట్టి, ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా తనికీ చేసుకోవడం మంచిది.

ఇక ఈ నోటిఫికేషన్ లో భాగంగా ప్రొబేషనరీ ఆఫీసర్స్‌/ మేనేజ్‌మెంట్ ట్రైనీస్‌ 5208 పోస్టులను, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ 1,007 పోస్టులను భర్తీ చేయనుంది. ప్రిలిమినరీ పరీక్షా, మెయిన్స్ పరీక్షా, వ్యక్తిగత పరీక్ష, ఇంటర్వ్యూ లాంటి నాలుగు విభాగాల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. వీటిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారిన జాబ్స్ కి ఎంపిక చేస్తారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com