బహ్రెయిన్ లో సీనియర్లు, వికలాంగులకు స్పెషల్ సర్వీసులు..!!
- July 28, 2025
మనామా: సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు మద్దతు ఇవ్వడానికి కొత్త చర్యలను బహ్రెయిన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకటించింది. చీఫ్ ప్రాసిక్యూటర్ నయీఫ్ యూసిఫ్ మహమూద్ మాట్లాడుతూ.. ఆయా వర్గాలకు అందుబాటులో ఉన్న సేవలను విస్తరించడంపై దృష్టి సారించినట్టు తెలిపారు. ఇప్పటికే అమలులో ఉన్న ప్రస్తుత ప్రత్యేక విధానాలతోపాటు వారి మరింత వెసులుబాటును అందించడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. వారి గౌరవాన్ని కాపాడేందుకు, ముఖ్యంగా అందరికీ సమానంగా న్యాయం పొందేందుకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుందని మహమూద్ అన్నారు.
ఈ మేరకు చర్యలు తీసుకోవాలని లిటిగెంట్స్ సర్వీస్ సెంటర్ ను ఆదేశించినట్లు తెలిపారు. వయస్సు లేదా వైకల్యం కారణంగా వ్యక్తిగతంగా హాజరు కావడం కష్టంగా ఉన్న సందర్భాల్లో రిమోట్గా ప్రశ్నించడానికి టెక్నాలజీని ఉపయోగించడం వంటివి ఉంటాయని తెలిపారు. వీరి దర్యాప్తులు త్వరగా పూర్తయ్యేలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నారు. వృద్ధులు లేదా వికలాంగులకు సంబంధించిన అన్ని కేసులను లాగ్ చేయడానికి, చట్టపరమైన ప్రక్రియలో తీసుకున్న ప్రతి అడుగును ట్రాక్ చేయడానికి ఎలక్ట్రానిక్ రిజిస్ట్రీ ఏర్పాటు చేయబడుతుందని స్పష్టంచేశారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







