ఘనంగా వంశీ ఇంటర్నేషనల్ స్వర్ణోత్సవాలు

- July 27, 2025 , by Maagulf
ఘనంగా వంశీ ఇంటర్నేషనల్ స్వర్ణోత్సవాలు

హైదరాబాద్‌: తెలుగు సంస్కృతి పరిరక్షణకు సాంస్కృతిక సంస్థలతో కూడిన కృషి అత్యవసరం అని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు.ఆయన మాట్లాడుతూ, గత 54 ఏళ్లుగా వంశీ సంస్థ ద్వారా కళారంగానికి వంశీ రామరాజు అందిస్తున్న సేవలు ప్రస్తావనీయమని ప్రశంసించారు.

శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదికగా వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వంశీ రామరాజు–సుధా దేవి దంపతుల వైవాహిక స్వర్ణోత్సవం సందర్భంగా ప్రముఖ వ్యాఖ్యాత్రి సుధామయి జన్మదినాన్ని గుర్తుగా ‘తెలుగు పాటకు పట్టాభిషేకం’ పేరిట సినీ సంగీత విభావరి జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దత్తాత్రేయ వంశీ దంపతులను సత్కరించి, వారు నిర్వహిస్తున్న విలువయిన కార్యక్రమాలు తెలుగు సమాజానికి గర్వకారణమవుతున్నాయని కొనియాడారు. వందలాది సినీ సంగీత కార్యక్రమాలకు వ్యాఖ్యానం చేసి “వ్యాఖ్యాన శిరోమణి”గా గుర్తింపు పొందిన సుధామయిని అభినందించారు.

సంఖ్యాశాస్త్ర వేత్త దైవజ్ఞ శర్మ, ప్రముఖ సినీ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తమ అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా సినీ గాయకులు మిత్ర, బాల కామేశ్వరరావు, వినోద్ బాబు, గీతాంజలి, వీణా ఫణి తదితరులు మధురమైన సినీ గీతాలను ఆలపించి ప్రేక్షకులను మైమరిపించారు.

కార్యక్రమం నిర్వహణను సుంకరపల్లి శైలజ సమర్థవంతంగా పర్యవేక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com