అల్ జాజిర్ కోస్టల్ లో ఫీల్డ్ సర్వే..అరుదైన పక్షులు గుర్తింపు..!!
- July 28, 2025
అల్ జాజిర్: ఒమన్ సుల్తానేట్‌లో పర్యావరణ వ్యవస్థల రక్షణ, జీవవైవిధ్యాన్ని పర్యవేక్షించడానికి పర్యావరణ అథారిటీ సిద్ధమవుతోంది. అల్ వుస్తా గవర్నరేట్‌లోని విలాయత్ అల్ జాజిర్ తీరప్రాంతంలో పక్షుల లెక్కలను తేల్చేందుకు ఫీల్డ్ సర్వేలను నిర్వహించింది. ఖోర్ ఘావి, ఖోర్ ఖైద్, ఖోర్ ఘాడిసిర్ అనే మూడు క్రీక్లపై ప్రధానంగా ఫోకస్ చేసినట్లు తెలిపారు.
అల్ వుస్తా గవర్నరేట్‌లోని పర్యావరణ పరిరక్షణ విభాగం అధిపతి అబ్దుల్లా సలీం అల్ వార్ది మాట్లాడుతూ.. వివిధ రకాల సముద్ర పక్షులు, వలస పక్షులను డాక్యుమెంట్ చేయడం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ సంవత్సరం అల్ వుస్తా గవర్నరేట్‌లో నిర్వహించిన సర్వేలు 60 కి పైగా వలస, అరుదైన పక్షుల ఉనికిని గుర్తించాయని అల్ వార్డి తెలిపారు.
ఇక పక్షి జాతులలో గ్రేట్ వైట్ హెరాన్, గ్రే హెరాన్, గ్రీన్-బ్యాక్డ్ హెరాన్, బ్లాక్ టెర్న్, శాండ్విచ్ టెర్న్, రోజేట్ టెర్న్, బ్లాక్ ఐబిస్, లిటిల్ శాండ్‌పైపర్, రెడ్-లెగ్డ్ శాండ్‌పైపర్, సైబీరియన్ గల్, గ్రేటర్ ఫ్లెమింగో, కామన్ మైనా, వాటర్ కర్ల్యూ, బుల్బుల్, హౌస్ కాకి, ఇతర జాతులు ఉన్నాయని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!