ట్రక్కును ఢీకొట్టిన కన్వర్ యాత్రికుల బస్సు.. 18మంది మృతి
- July 29, 2025
ఝార్ఖండ్ రాష్ట్రం దేవ్‌ఘడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 18మంది కన్వర్ యాత్రికులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇవాళ తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
దేవ్‌ఘడ్‌లోని బాబాధామ్ నుంచి డుమ్కాలోని బాసుకీనాథ్ ఆలయానికి కన్వర్ యాత్రికులతో 32 సీట్లతో కూడిన బస్సు వెళ్తుంది. ఈ బస్సులో అందరూ కన్వర్ యాత్రికులే ఉన్నారు. మోహన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమునియా అటవీ ప్రాంతానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న ట్రక్కును కన్వర్ యాత్రికులతో వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా ఐదుగురు అక్కడికక్కడే మరణించారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి స్థానిక తరలించారు. చికిత్స పొందుతూ మరో కొందరు చనిపోయారు. మొత్తం ఈ ప్రమాదంలో 18మంది మరణించినట్లు గుర్తించారు. చికిత్స పొందుతున్న వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని డీఐజీ సంతల్ ప్రజ్ఞా తెలిపారు. ఈ ప్రమాదం తీవ్రతకు బస్సు పూర్తిగా నుజ్జునుజ్జైంది.
ఈ ఘోర ప్రమాదంపై గొడ్డా నియోజకవర్గం బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే తన ‘ఎక్స్’ ఖాతాలో ఇలా పేర్కొన్నారు. ‘శ్రావణ మాసంలో కన్వర్ యాత్రకు వెళ్తున్న సందర్భంగా నా లోక్‌సభ నియోజకవర్గం పరిధి దేవ్‌ఘర్‌లో బస్సు, ట్రక్కు ఢీకున్న ప్రమాదంలో 18 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు’ అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!