సలాలాలో OMR80 మిలియన్లతో టూరిజం కాంప్లెక్స్..!!
- July 29, 2025
సలాలా: దోఫర్ గవర్నరేట్‌లో పర్యాటక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా సలాలాలోని జునుఫ్ ప్రాంతంలో OMR80 మిలియన్లతో ఒక ఇంటిగ్రేటెడ్ టూరిజం కాంప్లెక్స్ ను నిర్మించనునున్నారు. పర్యాటక మంత్రిత్వ శాఖ నిర్మాణ పనులను ప్రారంభించింది. ఫిబ్రవరి 2025లో కుదిరిన యూజ్‌ఫ్రక్ట్ ఒప్పందం ప్రకారం అల్-వాత్బా హాస్పిటాలిటీ కంపెనీతో భాగస్వామ్యంతో దీనిని అమలు చేయనున్నారు.
30నెలల్లో మొదటి దశలో 124 గెస్ట్ యూనిట్లతో కూడిన ఫైవ్ స్టార్స్ హోటల్, రెస్టారెంట్లు, కేఫ్‌లతో కూడిన మెరీనా, బీచ్ క్లబ్, హెల్త్ క్లబ్, కాంప్లెక్స్ మెయిన్ డోర్ వర్క్ షెడ్యూల్ లో ఉన్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒమన్‌లో గొప్ప సహజ, పర్యావరణ వైవిధ్యాన్ని కలిగి ఉన్న దోఫర్‌లో పర్యాటక స్పాట్ లను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన ప్రయత్నాలకు ఈ ప్రాజెక్ట్ అదనపు బలాన్ని ఇస్తుందని పేర్కొంది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు







