డొమెస్టిక్ వర్కర్ మర్డర్..కువైట్ సిటిజన్, అతడి భార్యకు మరణశిక్ష..!!
- July 29, 2025
కువైట్: ఫిలిప్పీన్స్ డొమెస్టిక్ వర్కర్ ను దారుణంగా హత్య చేసినందుకు కువైట్ వ్యక్తి, అతని భార్యకు క్రిమినల్ కోర్టు మరణశిక్ష విధించింది. పనిమనిషిపై శారీరకంగా దాడి చేయడం, చట్టవిరుద్ధంగా ఆమెను నిర్బంధించడం, ఆమెకు వైద్య సంరక్షణ నిరాకరించడం, నిరంతర హింసకు గురిచేయడం వంటి నేరాలకు ఈ జంటను దోషిగా కోర్టు నిర్ధారించింది.
పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకారం.. బాధితురాలిని పదే పదే కొట్టడం ద్వారా ఆమె మరణానికి దారితీసింది. సాధ్యమైనంత కఠినమైన శిక్షను ప్రాసిక్యూషన్ డిమాండ్ చేసింది. గృహ కార్మికులపై హింస కేసులను కువైట్ న్యాయవ్యవస్థ ఎంత సీరియస్ గా పరిగణిస్తుందో ఈ తీర్పు నొక్కి చెబుతుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!







