‘కింగ్డమ్’ నుంచి ‘రగిలే రగిలే’ లిరికల్ సాంగ్ విడుదల..
- July 29, 2025
విజయ్ దేవరకొండ కొత్త సినిమా ‘కింగ్డమ్’ నుంచి ‘రగిలే రగిలే’ లిరికల్ సాంగ్‌ను ఇవాళ విడుదల చేశారు. “మృత్యువు జడిసేలా..” అంటూ సాగుతున్న ఈ పాటను కృష్ణకాంత్ రాశారు.. సిద్ధార్థ్ బస్రూర్ పాడారు. కింగ్డమ్ సినిమాను డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి రూపొందించారు.
విజయ్ దేవరకొండ సరసన భాగ్య శ్రీ బోర్సే నటించింది. ఈ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది. స్పై యాక్షన్ డ్రామా సినిమాగా ‘కింగ్డమ్’ రూపుదిద్దుకుంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఈ సినిమా రన్‌టైమ్ 160 నిమిషాలుగా ఉంది.
ఈ సినిమా టికెట్ ధరల పెంపునకు ఏపీ సర్కారు అనుమతి ఇచ్చింది. 10 రోజుల పాటు ధరల పెంపునకు అనుమతి వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50, మల్టీప్లెక్స్‌ల్లో రూ.75 పెంచుకోవచ్చు. కాగా, సినిమా ప్రమోషన్లలో విజయ్ దేవరకొండ సహా సినీ బృందం పాల్గొంటోంది. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా నిర్వహించారు.
తాజా వార్తలు
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!
- కువైట్ నేవీ పెట్రోల్ బోట్ గరో, ఇండియన్ షిప్ కండక్ట్ జాయింట్ డ్రిల్..!!
- దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- సనద్ సేవా కేంద్రాల ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- బహ్రెయిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రూట్ మ్యాప్..!!
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!







