ఘనంగా ముగిసిన కార్గిల్ విజయ్ దివస్-సురభి ఏక ఎహసాన్
- July 30, 2025
హాంగ్ కాంగ్: తన చిన్ననాటి కల 'దేశం కోసం ఏమైనా చెయ్యాలి' అనే తపన పూర్తీ కాలేదు ఎందుకంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ లో సీటు దక్కలేదు.ఒక రేడియో వ్యాఖ్యాతగా, ఆ కాలనీ సాకారం చేసే అవకాశం లభిస్తుందని ఊహించలేదు టోరీ రేడియో వ్యాఖ్యాత జయ.తన రేడియో షో పేరు జై హింద్,ఈ పేరు ఎంచుకున్నందుకు రెండు కారణాలు-ఒకటి భారత్ దేశం కోసం కాబట్టి, రెండవ ది హిందీ వివిధభారతి లో 'జయ్ మాల' అని సైనికుల కార్యక్రమం తనకు అత్యంత ప్రియమైన ప్రోగ్రాం కాబట్టి దానికి తగినట్టుగా ఉండాలనే యత్నంలో 'జై హింద్' నిలిచిపోయింది.
అయితే షో పేరుకి కార్గిల్ విజయ్ దివస్ కి ఏమిటి సంబంధం? జై హింద్ లో అనేక హోదాల్లో వున్న విశ్రాంత సైనికులు, వారిలో ఎక్కువగా 'గాలంటరీ అవార్డ్స్ 'అందుకున్న వారు, వీర నారీలతో పరిచయాలు మరియు త్రిదళాల కుటుంబాలకు సేవలు అందచేసే స్వచ్చంద సంస్థలతో పరిచయాలు చెయ్యడం జరిగింది. వీరిలో కొందరు కార్గిల్ యుద్ధం లో సేవలు అందించిన వారున్నారు కనుక కార్గిల్ విజయ్ దివస్ వెనుక వున్న త్యాగం, భావోద్వేగాలు మరియు ఆనందాల విలువలు నెమ్మదిగా అర్ధం చేసుకొన్న జయ, కార్గిల్ విజయ దివస్ ని తన కర్మ భూమి హాంగ్ కాంగ్ లో చేయడం ప్రారంభించి 'సురభి ఏక ఎహసాన్ ' గా తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొంది. జయ మాట్లాడుతూ తన రేడియో షో ముఖ్య ఉద్దేశాన్ని పునరుద్ధరిస్తూ సైనికుల జీవితాలను వారి కుటుంబ త్యాగాలను సామాన్య పౌరులకు తెలియజేసే ప్రయత్నమని అందుకు టోరీ రేడియో యాజమాన్యం మరియు శ్రోతలు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారని, ఆ స్ఫూర్తి తో ఒక పుష్కర కాలంగా 'జై హింద్' షో చేస్తున్నాని తెలిపారు.
హాంగ్ కాంగ్ ప్రవాస భారతీయులందరు, ప్రతి సంవత్సరం "సురభి ఏ ఎహసాన్ " కార్యక్రమాన్నికి ఎంతో ఆదరణ అభిమానంతో వారందరూ దీనిని వారి వార్షిక క్యాలెండర్ ఈవెంట్లలో ఒకటిగా ఎదురు చూస్తారు. వారి హృదయాలలో ఈ స్థానం సంపాయించగలిగాను అంటే వారు మన రక్షణ దళాల గురించి ముఖ్యంగా మన సానికుల గురించి ఆలోచిస్త్రున్నారు అన్న తృప్తి నాకు ఒక వరం గా భావిస్తాను అంటారు టోరీ వ్యాఖ్యాత జయ పీసపాటి.
ఈ సంవత్సరం 'సురభి ఏక ఎహసాన్' కార్యక్రమం లో భాగంగా పిల్లలకు చిత్రలేఖనం పోటీలు మరియు మన జాతీయ భాష హిందీ లో కవితలు / గీత రచనల పోటీలు కూడా నిర్వహించడం ఒక విశేషం. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా భారత తాత్కాలిక కాన్సుల్ జనరల్ మిస్ సురభి గోయల్ మరియు భారతీయ గోర్ఖా రెజిమెంట్ విశ్రాంత జవాన్లు విచ్చేసారు. స్థానిక ప్రముఖులు, తమ అనేక కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించే స్వచ్చంద సంస్థ-టచ్ సెంటర్ రీజినల్ డైరెక్టర్ మిస్ కోనీ వాంగ్ కూడ కార్యక్రమానికి సంతోషంగా హాజరయ్యారు.
గౌరవ సత్కారాలనంతరం మిస్ సురభి గోయల్ తమ సందేశంలో, ఇటువంటి కార్యక్రమం ద్వారా భారతీయ పౌరులని ఒక తాటి పై తేవడం మరియు దేశ రక్షకుల గురించి అవగాహన కల్పించడాన్ని ఎంతగానో ప్రశంసించారు.ఈ తరం వారికి చక్కటి సందేశాన్ని అందించే కార్యక్రమ స్ఫూర్తిని అభినందించారు.ప్రతి యేటా తన టాక్ షో అతిదులైన సైనికుల సందేశాన్ని హాంగ్ కాంగ్ ప్రేక్షకులకి చూపిస్తారు, అలా ఈ సంవత్సరం 'సురభి ఏక ఎహసాన్ లో కార్గిల్ వెటరన్ కెప్టెన్ అఖిలేష్ సక్సేనా కార్గిల్ యుద్ధంలో వారి స్వీయ అనుభవాలని తెలియజేస్తూ సందేశాన్ని అందించారు .
అనంతరం పిల్లలు,పెద్దలు మరియు విశేషంగా జాలీ గుడ్ మైత్రివన్ క్లబ్ యొక్క సీనియర్ సిటిజన్లు దేశభక్తి గీతాలు మరియు నృత్యాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. చిత్రలేఖనం పోటీలో పాల్గొన్నవారందరికీ కషునుట్జ్ ఆర్ట్ స్టూడియో ఆర్ట్ డైరెక్టర్ మిస్ కశ్మీరా మెహతా దోషి బహుమతులు అందజేశారు. హిందీ కవిత / గీత రచన పోటీ విజేతలకు మరియు జడ్జెస్ కి, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి, పోటీల విజేతలకు సర్టిఫికెట్లు మరియు బహుమతులను సురభి అందజేశారు.
వందన సమర్పణలో రేడియో వ్యాఖ్యాత జయ గౌరవప్రదమైన హాజరుతో మరియు వారి వివేకవంతమైన మాటలతో అందరికి స్ఫూర్తినిచ్చినందుకు యాక్టింగ్ కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా సుర్భి గోయల్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గూర్ఖా రెజిమెంట్ నుండి వచ్చిన ధైర్యవంతులైన విశ్రాంత సైనిక అనుభవజ్ఞులకు ప్రత్యేక వందనాలందించారు. లీజుర్ అండ్ కల్చరల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ట, టచ్ సెంటర్ కి , జడ్జెస్ కి, కార్యక్రమ స్వచ్చంద సేవకులకు, నిర్వాహకులు పరేష్ న్యాతికి, పాల్గొన్న వారికి మరియు విచ్చేసిన వారికి కృతజ్ఞత వ్యక్తం చేశారు. అనంతరం అందరు జాతీయ గీతాన్ని ఆలపించి మళ్ళి వచ్చే సంవత్సరం 'సురభి ఏక ఎహసాన్' పదవ వార్షికోత్సవం ఇంతకన్నా ఘనంగా చేద్దామంటూ వీడ్కోలు చెప్పారు.



తాజా వార్తలు
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి
- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయం పై సీఎం రేవంత్ ని అభినందించిన ఎంపీలు
- మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో భారీ పెట్టుబడులకు అవకాశం
- 10 లక్షల ఉద్యోగాలు భారతీయులకు ఇస్తాం: అమెజాన్
- ఉర్దూ అకాడమీ వారోత్సవాలు: మంత్రి ఫరూక్
- 13న హైదరాబాద్ లో లియోనెల్ మెస్సీ సందడి
- గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్







