ఖతార్, ఒమన్ జాయింట్ వీసా ఆన్ అరైవల్
- July 16, 2016
ఖతార్ మరియు ఒమన్, 33 దేశాలకు చెందిన పౌరులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని ఆఫర్ చేస్తోంది. ఖతార్, ఒమన్లలో పర్యటించేవారికి ఈ సౌకర్యం ఎంతో ఉపయోగపడనుంది. ఆన్ అరైవల్ వీసా 30 రోజులపాటు చెల్లుబాటు అవుతుంది. మరో 30 రోజులు దీన్ని పొడిగించుకునే అవకాశం ఉంది. టూరిజం రంగాన్ని ఈ దేశాల్లో పెంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్‌పోర్టులు లేదా బోర్డర్ చెక్‌పోస్టుల వద్ద ఈ ఆన్ అరైవల్ వీసా సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, నెదర్లాండ్స్, బెల్జియమ్, లగ్జెంబర్గ్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, స్వీడన్, నార్వే, డెన్మార్క్, పోర్చుగల్, ఐర్లాండ్, గ్రీస్ తదితర దేశాలకు ఈ సౌకర్యం కల్పిస్తున్నాయి ఒమన్, ఖతార్ దేశాలు. ఈ నిర్ణయంతో ఖతార్, ఒమన్లలో టూరిజం మరింత అభివృద్ధి చెందుతుందని ఈ రెండు దేశాలూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







