వన్‌ప్లస్ ఇండిపెండెన్స్ సేల్ ఆఫర్లు..
- July 31, 2025
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌తో పాటు, ఈరోజు (జూలై 31) నుంచి భారత మార్కెట్లో వన్‌ప్లస్ ఇండిపెండెన్స్ సేల్ ప్రారంభమైంది.ఈ ఈవెంట్ OnePlus Nord 5, Nord CE 5, OnePlus 13 సిరీస్ వంటి స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది.అంతేకాదు..వన్‌ప్లస్ ఇయర్‌ఫోన్‌లు, వన్‌ప్లస్ టాబ్లెట్‌లు వంటి ఇతర వన్‌ప్లస్ ప్రొడక్టులపై కూడా భారీ డిస్కౌంట్లను పొందవచ్చు.
ఈ సేల్ సమయంలో కొనుగోలుదారులు ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, బ్యాంక్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా పొందవచ్చు. ఈ సేల్ సమయంలో వన్‌ప్లస్ 13 ధర తాత్కాలికంగా రూ.7వేల తగ్గింపు పొందవచ్చు. ప్రారంభ ధర రూ.62,999కి తగ్గింది. వన్‌ప్లస్ 13R ఫోన్ 16GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్ రూ.5వేలు చౌకగా ఉంటుంది. అయితే, 12GB + 256GB మోడల్‌పై రూ.3వేలు తగ్గింపు ఉంటుంది.ఈ ఆఫర్లు ఆగస్టు 17 వరకు అందుబాటులో ఉంటాయి.
స్మార్ట్‌ఫోన్ డిస్కౌంట్లు, ఆఫర్లు:
వన్‌ప్లస్ నార్డ్ 5, వన్‌ప్లస్ నార్డ్ CE 5 అన్ని వెర్షన్లు ఈ సేల్ సమయంలో ఎంపిక చేసిన కార్డులపై రూ. 2,250 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌తో వస్తాయి.ఈ మోడళ్ల ప్రారంభ లాంచ్ ధరలు వరుసగా రూ.31,999, రూ.24,999కు పొందవచ్చు.
ఇటీవలే వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ ఈ సేల్ ఈవెంట్ సమయంలో ఫస్ట్ టైమ్ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. లాంచ్ ఆఫర్లలో ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో పేమెంట్ చేసినప్పుడు రూ. 2వేలు తగ్గింపు కూడా ఉంటుంది.6GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో Wi-Fi వేరియంట్ కోసం ఈ టాబ్లెట్‌ను రూ. 15,999 ప్రారంభ ధరతో ప్రవేశపెట్టింది.
టాబ్లెట్, అప్లియన్సెస్ డీల్స్:
ఈ సేల్ సమయంలో వన్‌ప్లస్ ప్యాడ్ 2పై ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్లు, రూ. 2వేల వరకు ధర డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఫ్రీ స్టయిలో 2 స్టైలస్ కూడా పొందవచ్చు. అసలు ధర రూ. 39,999, వన్‌ప్లస్ ప్యాడ్ గో రూ. 19,999కు లాంచ్ అయింది.
ఆడియో ప్రియుల కోసం వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3పై రూ. 2వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌తో పాటు ఈ సేల్ సమయంలో ఎంపిక చేసిన బ్యాంక్ కార్డుల ద్వారా అదనంగా రూ. వెయ్యి తగ్గింపు లభిస్తుంది. వన్‌ప్లస్ బడ్స్ ప్రో ధర భారత మార్కెట్లో రూ.8,999గా ఉండగా, నార్డ్ బడ్స్ ప్రో లిమిటెడ్ టైమ్ ధర తగ్గింపుతో పాటు అర్హత కలిగిన కార్డులపై రూ.400 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు.
వన్‌ప్లస్ ఇండిపెండెన్స్ డే సేల్‌ను అధికారిక వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మైంట్రా బ్లింకిట్ వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా జూలై 31 మధ్యాహ్నం నుంచి యాక్సస్ చేయొచ్చు.క్రోమా రిలయన్స్ డిజిటల్ విజయ్ సేల్స్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్స్‌తో సహా ఆఫ్‌లైన్ పార్టనర్ అవుట్‌లెట్‌లు కూడా ఈ ప్రమోషనల్ ఈవెంట్‌లో అందుబాటులో ఉంటాయి.అయితే సేల్ ఎప్పుడు ముగుస్తోందో తేదీ వెల్లడించలేదు. కొన్ని ఆఫర్‌లు ఆగస్టు 31 వరకు పొడిగించాయి.
తాజా వార్తలు
- వచ్చే యేడాది అందుబాటులోకి రానున్న విమాన కార్గో సేవలు
- మైనర్ బాలిక పై లైంగిక దాడి..భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్‌లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!







