దుబాయ్ మెరీనా భవనంలో అగ్నిప్రమాదం.. నివాసితులకు అనుమతి..!!
- August 01, 2025
యూఏఈ: దుబాయ్ మెరీనాలోని ఎత్తైన నివాస టవర్ పై అంతస్తులో శుక్రవారం తెల్లవారుజామున సంభవించిన అగ్నిప్రమాదం, గంటల్లోనే ఫైర్ ఫైటర్స్ మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దాదాపు రెండు గంటల అనంతరం మెరీనా సెయిల్ నివాసితులను వారి అపార్ట్‌మెంట్లలోకి తిరిగి అనుమతించారు.
అగ్ని ప్రమాద హెచ్చరికల శబ్దంతో తెల్లవారుజామున 3.30 గంటలకు మేల్కొన్నట్లు భవనంలో నివసించే సిరియన్ విద్యార్థి వివరించారు. "ఇది ఒక భయానక అనుభవం" అని సిరియన్ విద్యార్థి అన్నారు. కాగా, అగ్నిప్రమాద భవనంలోని బాధిత అద్దెదారులకు బైబ్లోస్ హోటల్ సిబ్బంది సహాయం అందించారు కొంతమంది నివాసితులకు హోటల్ సిబ్బంది ఆశ్రయం కల్పించారు.
జూన్‌లో దుబాయ్ మెరీనాలోని టైగర్ టవర్‌లో జరిగిన అగ్నిప్రమాదం 3,820 మంది నివాసితులను ఖాళీ చేయించింది. అగ్నిమాపక సిబ్బంది 67 అంతస్తుల భవనంలో మంటలను ఆర్పడానికి రాత్రంతా శ్రమించారు. ట్రామ్ సేవలు 24 గంటలు నిలిపివేయబడ్డాయి. నివాసితులు తమ వస్తువులను పొందలేకపోయారు. జూలై 17 నాటికి, మెరీనా పినాకిల్ అగ్నిప్రమాదం జరిగిన ఒక నెల తర్వాత కూడా కొందరు అద్దెదారులు కొత్త ఇళ్లను వెతుక్కోవడంలో ఇబ్బంది ఎదుర్కొన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







