లైసెన్స్ లేకుండా కాస్మెటిక్ సర్జరీ..ఈజిప్షియన్ అరెస్టు..!!

- August 01, 2025 , by Maagulf
లైసెన్స్ లేకుండా కాస్మెటిక్ సర్జరీ..ఈజిప్షియన్ అరెస్టు..!!

కువైట్: సబా అల్-సలేం ప్రాంతంలోని ఒక మహిళా సెలూన్ లోపల పనిచేస్తున్న లైసెన్స్ లేని కాస్మెటిక్ క్లినిక్‌ను క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్ సీజ్ చేసింది. దీనికి సంబంధించి హవల్లి గవర్నరేట్ ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్‌మెంట్ ఒక ఈజిప్షియన్ జాతీయుడిని అరెస్టు చేసింది. అతను ఒక వ్యవసాయ కాంట్రాక్టు కంపెనీలో పశువైద్యుడిగా పనిచేస్తున్నాడని, కానీ చట్టవిరుద్ధంగా ప్లాస్టిక్ సర్జరీలు చేస్తున్నట్లు గుర్తించారు. చెల్లుబాటు అయ్యే మెడికల్ లైసెన్స్ లేకుండా KD 50 ధర గల ఇంజెక్షన్లతో సహా కాస్మెటిక్ ప్రక్రియలు చేస్తున్నప్పుడు అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 

ఈ సందర్భంగా కాస్మెటిక్ పరికరాలు, లైసెన్స్ లేని వైద్య సామాగ్రి, ఇంజెక్షన్లు, లేజర్ పరికరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు మహిళా కార్మికులను అదుపులోకి తీసుకున్నారు.  ఇటీవల పౌరసత్వం రద్దు చేయబడిన ఒక మహిళకు చెందిన సెలూన్ అని దర్యాప్తులో తేలింది. లైసెన్స్ లేని ఆరు సెలూన్లు, మహిళా ఆరోగ్య కేంద్రాల నెట్‌వర్క్‌ను నడుపుతున్నానని, వాటిని తాత్కాలిక క్లినిక్‌లుగా మార్చినట్లు విచారణ సందర్భంగా ఈజిప్షియన్ అంగీకరించాడని అధికారులు తెలిపారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com