ఒమన్ ఆహార భద్రతకు నాంది.. 90,000MT రా షుగర్ దిగుమతి..!!
- August 03, 2025
సోహార్: ఆహార భద్రత దిశగా ఒమన్ అడుగులు వేసింది. మొదటి చక్కెర శుద్ధి కర్మాగారం 90,000 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ రా షుగర్ ను దిగుమతి చేసుకుంది. ఇది ఆహార తయారీ కార్యకలాపాలలో విస్తరణకు నాంది పలికిందని, ఇది స్థానిక సరఫరాచైన్ కు మద్దతు ఇస్తుందన్నారు.పారిశ్రామిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడంతో పాటు కొత్త గ్రాడ్యుయేట్లు, స్థానిక సాంకేతిక సిబ్బందికి ఆశాజనక అవకాశాలను అందించడానికి దోహదపడుతుందని చక్కెర శుద్ధి కర్మాగారం డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ నాసర్ బిన్ అలీ అల్ హోస్ని తెలిపారు.
సోహార్ పారిశ్రామిక నౌకాశ్రయంలో 180,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ శుద్ధి కర్మాగారాన్ని నిర్మించారు. మధ్యప్రాచ్యంలో ఇదే మొదటిది అని పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏటా ఒక మిలియన్ టన్నుల వరకు షుగర్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుందన్నారు. ఈ ఉత్పత్తి స్థానిక, ప్రాంతీయ, ఎగుమతి మార్కెట్లకు సేవలు అందిస్తుందన్నారు.
బ్రెజిల్ నుండి మొదటి షిప్మెంట్, మొత్తం 90,000 మెట్రిక్ టన్నులు రాగా, ఆటోమేటెడ్ మొబైల్ క్రేన్లు , హై-స్పీడ్ రవాణా వ్యవస్థలను ఉపయోగించి రిఫైనరీలోకి చేర్చారు. వచ్చే సెప్టెంబర్‌లో వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించడానికి కార్యాకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!







