ఎతిహాద్ రైలులో ప్రయాణించిన షేక్ మొహమ్మద్..!!
- August 03, 2025
యూఏఈ: దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ దుబాయ్ నుండి ఫుజైరాకు ఎతిహాద్ రైలు ప్యాసింజర్ రైలులో ప్రయాణించారు.ఈ మేరకు ఫోటోలను Xలో షేర్ చేశారు.ఈ జాతీయ ప్రాజెక్ట్ ప్రాముఖ్యతను హైలైట్ చేశారు.ఇది దేశవ్యాప్తంగా 11 నగరాలను కవర్ చేస్తుందన్నారు.పశ్చిమాన అల్ సిలా నుండి తూర్పున ఫుజైరా వరకు 200కిలో మీటర్ల వేగంతో వెళ్లగలదు. వచ్చే ఏడాది నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్న ఈ ప్రాజెక్టు 2030 నాటికి ఏటా 36 మిలియన్ల మంది ప్రయాణికులను రవాణా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఎతిహాద్ రైలు ద్వారా అనుసంధానించబడిన ముఖ్య నగరాలు:
- అబుదాబి
- దుబాయ్
- షార్జా
- రస్ అల్ ఖైమా
- ఫుజైరా
- అల్ ఐన్
- రువైస్
- అల్ మిర్ఫా
- అల్ ధైద్
- గ్హువైఫాత్ (సౌదీ అరేబియా సరిహద్దులో)
- సోహార్ (ఒమన్, హఫీత్ రైలు ప్రాజెక్ట్ ద్వారా)
తాజా వార్తలు
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!







