కువైట్‌లో రొయ్యలు, చేపల వేటపై నిషేధం ఎత్తివేత..!!

- August 03, 2025 , by Maagulf
కువైట్‌లో రొయ్యలు, చేపల వేటపై నిషేధం ఎత్తివేత..!!

కువైట్: కువైట్ లో రొయ్యలు, చేపల వేట సీజన్ అధికారికంగా ప్రారంభమైందని వ్యవసాయ వ్యవహారాలు,  చేపల వనరుల ప్రజా అథారిటీ (PAAAFR) ప్రకటించింది. ఈసందర్భంగా PAAAFR డైరెక్టర్ జనరల్ ఇంజనీర్ సలేం అల్-హై మాట్లాడుతూ..ఈ సీజన్ సముద్ర చేపల నిల్వ సంరక్షణకు మద్దతు ఇస్తుందని, వార్షిక చేపల వేట నిషేధం ముగిసిన తర్వాత రొయ్యలకు స్థానిక మార్కెట్ కు తరలిస్తాని తెలిపారు.  సముద్ర వనరులను రక్షించడంలో మత్స్యకారులు అన్ని నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆయన కోరారు. సెప్టెంబర్ 1 నుండి కువైట్ ప్రాదేశిక జలాల్లో రొయ్యలు, చేపల వేటను అనుమతించనున్నట్లు అల్-హై గుర్తించారు.

జూలై మధ్యలో జుబైదీ (పామ్‌ఫ్రెట్) చేపల వేట సీజన్ బలంగా ప్రారంభమైన తర్వాత, స్థానిక రొయ్యలు సమృద్ధిగా తిరిగి వచ్చాయని ఆయన వివరించారు. మత్స్యకారులలో ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. గత 24 గంటల్లో సుమారు 8 టన్నుల రొయ్యలు, 3 టన్నుల జుబైదీని పట్టుకున్నట్లు అల్-సుబై చెప్పారు.

మధ్య తరహా జుబైదీ చేపలు ప్రస్తుతం బుట్టకు KD 40 నుండి KD 60 వరకు అమ్ముడవుతున్నాయి. ఇది మార్కెట్ ధరలను స్థిరీకరించడానికి సహాయపడుతుంది. "షహామియా" రొయ్యల బుట్ట ధర KD 20కి చేరుకుంది. అయితే "ఉమ్మ్ నుఘిరా" రొయ్యల ధర షార్క్, ఫహాహీల్ చేపల మార్కెట్లలో KD 47 - KD 60 మధ్య ఉంటుంది. రోజువారీ చేపల వేలం ఉదయం 8:00 గంటలకు ఫహాహీల్‌లో.. సౌఖ్ షార్క్‌లో మధ్యాహ్నం ప్రార్థన తర్వాత ప్రారంభం అవుతుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com