పెర్సీడ్స్ ఉల్కాపాతం.. ఆగస్టు 12న యూఏఈ ఆకాశంలో అద్భుతం..!!
- August 04, 2025
యూఏఈ: పెర్సీడ్స్ ఉల్కాపాతం యూఏఈ వాసులను కనువిందు చేయనుంది. ఇది ఆగస్టు 12 నుండి 13 వరకు గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ఖగోళ నిపుణులు తెలిపారు.
ఎప్పుడు, ఎక్కడ చూడాలి?
దుబాయ్ ఆస్ట్రానమీ గ్రూప్ ప్రకారం, అర్ధరాత్రి తర్వాత తెల్లవారుజాము వరకు ఆకాశంలో వీక్షించవచ్చు. స్టార్గేజర్లకు టెలిస్కోపులు లేదా బైనాక్యులర్లు అవసరం లేదు. నేరుగా కంటితో చూడవచ్చు. 20 నుండి 30 నిమిషాల వరకు వీటిని చూడవచ్చు. ఆగస్టు 12న, DAG రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు జెబెల్ జైస్‌లో ప్రత్యేక పెర్సియిడ్స్ ఉల్కాపాత వీక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. నివాసితులు దేశంలోని ఎత్తైన, చల్లని ప్రదేశాలలో ఒకదాని నుండి ఆకాశంలో వీటిని చూడవచ్చు.
పెర్సియిడ్స్ ఉల్కాపాతం అంటే ఏమిటి?
కామెట్ స్విఫ్ట్–టటిల్ శిథిలాల గుండా భూమి ప్రయాణిస్తున్నప్పుడు పెర్సియిడ్స్ సంభవిస్తాయి. ఈ దుమ్ము, మంచు కణాలు 59 కి.మీ/సె వేగంతో వాతావరణంలోకి ప్రవేశిస్తాయి. ఆ సమయంలో అవి మండిపోతాయి. ఇది మనం చూసే ప్రకాశవంతమైన కాంతి చారలకు ఇదే కారణం. స్విఫ్ట్-టటిల్ తోకచుక్క ప్రతి 133 సంవత్సరాలకు ఒకసారి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. చివరిసారిగా 1992లో భూమికి దగ్గరగా వెళ్ళింది. మళ్లీ ఇది 2126లో తిరిగి వస్తుందని నిపుణులు చెప్పారు.
పెర్సియిడ్స్ను ఎలా ఫోటో తీయాలి?
ఫోటోగ్రఫీ ఔత్సాహికుల కోసం DAG కొన్ని టిప్స్ ఇచ్చింది. ISO, ఎపర్చరు, షట్టర్ వేగం వంటి సెట్టింగ్‌లపై పూర్తి మాన్యువల్ నియంత్రణ కోసం DSLR లేదా మిర్రర్‌లెస్ కెమెరాను ఉపయోగించి ఫోటోలను తీయవచ్చు. వైడ్-యాంగిల్ లెన్స్ మీకు ఆకాశంలో ఎక్కువ భాగాన్ని కవర్ చేయడంలో సహాయపడుతుంది. మీ ఎపర్చర్‌ను f/2.8 లేదా అంతకంటే తక్కువకు సెట్ చేయాలి. 15–30 సెకన్ల ఎక్స్‌పోజర్‌ని ఉపయోగించాలి. ISOని 1600 లేదా అంతకంటే ఎక్కువకు సర్దుబాటు చేయాలని తెలిపింది.
తాజా వార్తలు
- GMU అలుమ్ని సమ్మిట్ 2026.. నాలుగు దేశాల్లో కొత్త అంతర్జాతీయ అలుమ్ని చాప్టర్ల ప్రారంభం
- దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ 2026.. డిసెంబర్ 4 నుంచి 45 రోజుల పాటు సందడే సందడి!
- ఎన్విడియా సీఈవోగా మళ్లీ జెన్సన్ హువాంగ్
- సౌదీ–కువైట్ నేతల మధ్య కీలక చర్చలు
- బుల్లెట్ రైలు ట్రయల్ రన్ పై అశ్విని వైష్ణవ్ కీలక అప్డేట్
- యూఏఈ 55వ ఈద్ అల్ ఎతిహాద్ వేడుకలకు ఐదు రోజుల సంబరాలు..
- ఆఫీసు కంప్యూటర్లలో వాట్సాప్ వాడకంపై కేంద్రం హెచ్చరిక
- తమకు జరిగిన నష్టానికి అమెరికా బాధ్యత వహించాలి: ఇరాన్
- యూఏఈలో ప్రభుత్వ సేవలకు ఏఐ అసిస్టెంట్ ‘మీరా’..!!
- ఒమన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, 17 మందికి గాయాలు..!!







