అల్ ఐన్‌లో భారీ వర్షాలు, బలమైన గాలులు..హెచ్చరికలు జారీ..!!

- August 04, 2025 , by Maagulf
అల్ ఐన్‌లో భారీ వర్షాలు, బలమైన గాలులు..హెచ్చరికలు జారీ..!!

యూఏఈ: యూఏఈలో అధిక ఉష్ణోగ్రతలతోపాటు భారీ వర్షాలు నివాసితులను పలుకరిస్తున్నాయి. ఆగస్టు 1న ఉష్ణోగ్రతలు 51.8°Cకి చేరుకోవడంతో, ఆగస్టు నెలలో మండే ఎండలో.. అల్ ఐన్ నగరంలోని వారు చల్లదనాన్ని ఆస్వాదించారు. 

సాధారణంగా, అల్ మిర్జామ్ అని పిలువబడే ప్రస్తుత వేసవి కాలంలో దేశంలో వాతావరణ పరిస్థితులు మరింత వేడిగా ఉంటాయని భావిస్తున్నారు. ఈ సీజన్ ఆగస్టు 10న ముగియనుంది.

స్టార్మ్ సెంటర్ ఆన్‌లైన్‌లో షేర్ చేసిన వీడియోలు అబుదాబిలోని అల్ ఐన్ నగరంలోని నివాస ప్రాంతమైన ఉమ్ ఘఫాలో భారీ వర్షపాతం నమోదైనట్లు తెలిపింది.  వర్షంతోపాటు బలమైన గాలులు ఆ ప్రాంతంలో వీచాయని, ఇవి వాతావరణ పరిస్థితుల తీవ్రతను పెంచాయని పేర్కొన్నారు. భారీ వర్షాలు, ఈదురుగాలులతో కూడిన గాలివానలు వాహనదారులకు డ్రైవింగ్ చేయడానికి సవాలుతో కూడిన పరిస్థితులను సృష్టించాయని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ అహ్మద్ హబీబ్ అన్నారు.నివాసితులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వాహనదారులు వర్షాలు కురిసే సమయంలో వేగ పరిమితులను పాటించడంతోపాటు నిబంధనలను ఫాలో కావాలని అధికారులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com