మళ్లీ జయంరవి, హన్సిక జత..
- July 16, 2016
ఒక్కప్పుడు రీమేక్ చిత్రాలకు మాత్రమే పరిమితమైన జయంరవి ఇప్పుడు తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. 'తని ఒరువన్'తో అయన నిజంగానే 'తని' (ప్రత్యేక) ట్రాక్‌లో వెళ్తున్నారు. 'రోమియో జూలియట్', 'మిరుదన్' వంటి సినిమాలు ఆయనకు మరింత గుర్తింపును తీసుకొచ్చాయి. ఈ వరుసలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'బోగన్'. లక్ష్మణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మళ్లీ జయంరవి, హన్సిక జతకడుతున్నారు. వారి కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది. 'తని ఒరువన్'లో హీరోయిజానికి పోటీగా విలనిజాన్ని కనబరిచిన అరవింద్‌స్వామి ఇందులో కూడా నటిస్తున్నారు. ఇందులో వీరిద్దరూ మిత్రులుగా నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో విలన్ ఎవరనేది ఇంకా తేల్చలేదు. సినిమా చూస్తున్నప్పుడే ఆ విషయం స్పష్టమవుతుందని అంటున్నారు దర్శకుడు. ఈ చిత్రంలో హన్సిక నిందితురాలిగా జయంరవి పోలీసు అధికారిగా నటిస్తున్నారు. ఈ సినిమా గురించి జయంరవి చెప్పిన విశేషాలు...
ప్ర: వరుస విజయాలు కథానాయకుడిని ఉత్సాహ పరుస్తాయి. మీకెలా అనిపిస్తోంది? జ: ఆ విషయం అక్షరాల నిజమే. ప్రస్తుతం నేను ఉత్సాహంగా ఉన్నా. అందువల్లే చాలా వేగంతో 'బోగన్'ను రూపొందిస్తున్నాం. నేను మానాన్న దగ్గర నేర్చుకున్న తెలివితోనే ఇంతదూరం ప్రయాణం చేయగలుగుతున్నా. మంచి కథ అయితే రవి వద్ద చెబుదాం అని పలువురు దర్శకులు అనుకుంటున్నారంటే అందుకు కారణం మా నాన్న, అన్నే.
ప్ర: మీరు, హన్సిక నటిస్తున్న మూడో సినిమా ఇది. కెమిస్ట్రీ ఎలా కుదిరింది? జ: 'ఎంగేయుం కాదల్'లో చిత్రీకరణలో ఆమె కళాశాల విద్యార్థినిలా కనిపించారు. ఇప్పుడు మాత్రం నటనలో ఆమె ప్రొఫసర్ అయ్యారు. ఇందులో చాలా జాలీ అమ్మాయిగా నటించారు. అంతేకాదు.. ఆమె నిందితురాలు కూడా. నిందితురాలిగా ఆమె, పోలీసుగా నేను.. చేసే కామెడీ గలాటా అంతాఇంత కాదు. ఆ తర్వాత అదే ప్రేమగా మారుతుంది. కెమిస్ట్రీపరంగా ఈసినిమాలో ఇంకాస్త అభివృద్ధి చెందాం.
ప్ర: ఇందులో అరవింద్‌స్వామి పేరును సూచించింది మీరేగా? జ: తని ఒరువన్' సమయంలో ఆయనతో నటించడం గొప్ప విషయంగా భావిస్తున్నా. అంతేకాకుండా ఆమె నటనపై ఆయనకున్న అంకితభావాన్ని గుర్తించా. ఇక 'బోగన్'లో మేం అనుకున్న పాత్రకు అరవింద్‌స్వామి అయితే బాగుంటుందని దర్శకుడికి చెప్పా. వెంటనే అరవింద్‌స్వామికి ఫోన్‌చేసి ఈ కథ చెప్పారు. మీరు నటిస్తే ఇంకా బాగుంటుందని అన్నా. అందుకు ఆయన మొదట్లో నిరాకరించారు. 'ఇప్పుడేగా మనం కలసి నటించాం. వెంటనే మళ్లీ రిపీట్ అయితే వేరేలా మారిపోతుంది' అన్నారు. కానీ మీరైతేనే బాగుంటుందని చెప్పి ఒప్పించా. అలా ఆయన ఈ ప్రాజెక్టులోకి వచ్చారు.
ప్ర: ఇందులో ఆయన విలన్‌గా నటిస్తున్నారా? జ: విలన్ అని చెప్పలేం. ఇందులో నేను విలన్‌గా ఉన్నప్పుడు ఆయన హీరోగా, నేను హీరోగా ఉన్నప్పుడు ఆయన విలన్‌గా కనిపిస్తారు. అది అర్థం కావాలంటే సినిమా చూడాల్సిందే. ఇది ఓ భిన్నమైన వన్‌లైన్ కథ. ఇదివరకు చూడని అరవింద్‌స్వామిని ఇందులో మీరు తప్పకుండా చూస్తారు.
ప్ర: ఇటీవల విజయ్, అజిత్ తమ ఫ్యామిలీతో లండన్ వెళ్లారు. మీరు వెళ్లినట్టున్నారే? జ: సంవత్సరంలో ఒకసారి కుటుంబ సభ్యులతో కలసి విదేశీ పర్యటనకు వెళ్తున్నా. నేను షూటింగ్‌లో ఎంత బిజీ అని చెప్పినా నా భార్య రాజీ పడరు. తప్పకుండా వెళ్లి తీరాల్సిందే. విజయ్, అజిత్ అన్నలను నేను చూడలేదు. అక్కడ జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లను ఫ్యామిలీతో కలసి చూశా. నా భార్య కూడా అక్కడే చదువుకున్నారు. ఆ కళాశాలను కూడా చూసొచ్చా.
ప్ర: మీ అన్న హీరోగా ఓ సినిమాకు దర్శకత్వం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది? జ: అది తప్పకుండా జరుగుతుంది. ప్రస్తుతం నేను నటించే సినిమాలతో బిజీగా ఉన్నందున కాస్త ఆలస్యం కావొచ్చు. ఓ మంచి సబ్జెక్టును ఎంచుకుని వీలైనంత త్వరగా దర్శకత్వం వహిస్తా. అందులో సందేహం లేదు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







