అమైరా దస్తూర్ రాజ్ తరుణ్ తో
- July 16, 2016
అప్ కమింగ్ హీరోయిన్స్...సీనియర్ హీరోలతో నటిస్తే వెంటనే ఓ రేంజ్ వస్తుంది. స్టార్ డమ్ వస్తుంది. అయితే...వారికి మనసులో మాత్రం ... తన వయసుకు తగ్గ హీరోతో యాక్ట్ చేస్తే బాగుంటుందనిపిస్తుంది. అమైరా దస్తూర్ అనే భామకి రెండేళ్ల కిందటే తెలుగు మూవీ ఛాన్స్ వచ్చింది. పూరీ జగన్నాథ్ తో ఓ మూవీ, మంచు విష్ణుకు జంటగా చేయడానికి మరో మూవీ ఛాన్స్ వచ్చింది.అయితే అనుకోకుండా సడన్ గా ...ఇంటర్ నేషనల్ స్టార్ జాకీచాన్ మూవీ 'కుంగ్ ఫూ యోగా'లో అవకాశం వచ్చింది. అంత పెద్ద ఛాన్స్ ను ఎవరైనా ఎలా వదులుకుంటారు చెప్పండి. కాబట్టి పూరీ జగన్నాథ్ మూవీని, మంచు విష్ణు మూవీని పక్కన పెట్టి జాకీచాన్ సినిమాకోసం వెళ్లిపోయి... కంప్లీట్ చేసి వచ్చింది. వచ్చీ రావడంతోనే టాలీవుడ్ మూవీ ఛాన్స్ కొట్టేసింది. యంగ్ హీరో రాజ్ తరుణ్ తో ఓ సినిమా చేయబోతోంది అమైరా దస్తూర్. నిజానికి రాజ్ తరుణ్ తో చేయబోయే సినిమాను కూడా ఏడాది కిందటే చేయాల్సి ఉంది. కానీ జాకీచాన్ మూవీ కోసం వదులుకుందట. రాజ్ తరుణ్ తో యాక్ట్ చేసే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందని చెప్పింది అమైరా. ఇప్పటికైనా తన వయసుకు మ్యాచ్ అయ్యే హీరోతో మొదటిసారి చేస్తున్నానని, రాజ్ తరుణ్ తనకన్నా ఏడాది మాత్రమే పెద్ద అని చెప్పిందీ చిన్నారి. అవకాశం వస్తే పూరీ జగన్నాథ్ సినిమాలో కూడా చేస్తానంటోంది.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







