బహ్రెయిన్ లో దంచికొడుతున్న ఎండలు.. అధిక ఉష్ణోగ్రతలు..!!

- August 05, 2025 , by Maagulf
బహ్రెయిన్ లో దంచికొడుతున్న ఎండలు.. అధిక ఉష్ణోగ్రతలు..!!

మనామా: అధిక ఉష్ణోగ్రతలతో బహ్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆగస్టు నెల ప్రారంభం నుంచి అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు వాతావరణ డైరెక్టరేట్ తెలిపింది. సాధారణంగా ఆగస్టు నెలలో బహ్రెయిన్ వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. పగలు మరియు రాత్రి సమయాల్లో వాతావరణం వేడిగా, తేమగా ఉంటుందన్నారు. పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు 43°C నుంచి 45°C మధ్య నమోదవుతాయని, ఇక పీక్ అవర్స్ లో ఉష్ణోగ్రత 50°Cకి చేరుకుంటుందన్నారు.

అప్పుడప్పుడు తేమతో కూడిన వాతావరణం ఉంటుందని, 5 నుండి 10 నాట్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయన్నారు.  ప్రజలు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఇండ్లలోనే ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచించారు. ఒకవేళ మధ్యాహ్నం సమయంలో బయటకు వెళితే ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలన్నారు.  అవసరమైతే వైద్యులను సంప్రదించాలని సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com