కువైట్ లో బయోమెట్రిక్ టెక్నాలజీతో ఏటీఎం మోసాలు..!!

- August 05, 2025 , by Maagulf
కువైట్ లో బయోమెట్రిక్ టెక్నాలజీతో ఏటీఎం మోసాలు..!!

కువైట్ : ATM కార్డ్ లెస్ విత్‌డ్రా ఫీచర్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్న ఆసియా గ్యాంగ్‌ను కువైట్ క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్ అరెస్టు చేసింది. బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ టెక్నాలజీని ఉపయోగించి, 24 గంటల్లోనే జలీబ్ అల్-షుయౌఖ్‌లో ఒక బెంగాలీ అనుమానితుడిని గుర్తించి అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు. వారి వద్దనుంచి విదేశాలకు డబ్బు బదిలీ చేయడానికి ఉపయోగించే KD 5,000, సిమ్ కార్డులులతోపాటు బ్యాంక్ కార్డులు,  ఎక్స్ఛేంజ్ షాప్ రసీదులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ఒక దుస్తుల కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు పాకిస్తానీలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.  దర్యాప్తు వేగంగా జరుగుతోందని, త్వరలోనే మరింత మంది నిందితులను అదుపులోకి తీసుకుంటామని వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com