మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్‌పై బిగ్ అప్డేట్.. ఈ 5 కేటగిరీల బస్సుల్లో ఉచిత ప్రయాణం..
- August 05, 2025
ఏపీలో మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ పై కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుందని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఫ్రీ బస్ అమలు, విధి విధానాలపై ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. మంత్రివర్గ ఉప సంఘం భేటీలో హోంమంత్రి అనిత, మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, సంధ్యారాణి పాల్గొన్నారు.
స్త్రీ శక్తి పథకం మార్గదర్శకాలను క్యాబినెట్ సబ్ కమిటీ రూపకల్పన చేసింది. ఎల్లుండి ఈ పథకాన్ని మంత్రివర్గం ఆమోదించనుంది. ఇక ఏపీ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం ఉంటుందన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, అల్ట్రా ఎక్స్ ప్రెస్, ఇంటర్ సిటీ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేయొచ్చని ఆయన తెలిపారు. స్త్రీ శక్తి పథకానికి ఏడాదికి 1950 కోట్ల రూపాయలు ఖర్చు కానుందన్నారు. ఏపీకి చెందిన రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఉన్న వారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుందన్నారు. ఇక ట్రాన్స్ జెండర్లకు కూడా స్త్రీ శక్తి పథకం వర్తించనుంది.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







