యూఏఈ వాసులను బయపెట్టిన భూకంపం..!!

- August 06, 2025 , by Maagulf
యూఏఈ వాసులను బయపెట్టిన భూకంపం..!!

యూఏఈః యూఏఈలో స్వల్ప భూకంపం నమోదైంది. భూకంపం వచ్చిందని పలువురు నివాసితులు సోషల్ మీడియాలో వెల్లడించారు. భూకంప తీవ్రంగా తాము స్వల్పంగా అనుభించినట్లు పేర్కొన్నారు. మరోవైపు ఖోర్ ఫక్కన్‌లో 2 తీవ్రతతో భూకంపం నమోదైందని జాతీయ వాతావరణ కేంద్రం (ఎన్‌సిఎం) తెలిపింది.యూఏఈ కాలమానం ప్రకారం రాత్రి 8.35 గంటలకు  ఈ భూకంపం వచ్చింది. అయితే, భూకంపం తీవ్రత స్వల్పంగా ఉందని, దాంతో ఎటువంటి ప్రమాదం లేదని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది.  కాగా, భూకంప కేంద్రం భూమికి 5 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.ఈ మేరకు భూకంపం సంభవించిన ప్రదేశం యొక్క ఫోటోను జాతీయ వాతావరణ కేంద్రం తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com