సౌదీ అరేబియాలో భారీగా తగ్గిన రోడ్ యాక్సిడెంట్స్, మరణాలు..!!
- August 06, 2025
దమ్మామ్: సౌదీ అరేబియాలో అమలవుతున్న ట్రాఫిక్ సంస్కరణలు ఫలితాలను ఇస్తున్నాయి. రోడ్ యాక్సిడెంట్స్ తగ్గడంతోపాటు ప్రమాదంలో మరణించే వారి సంఖ్యలో భారీ తగ్గుదల నమోదైంది. తూర్పు ప్రావిన్స్‌లో ట్రాఫిక్ మరణాలు లక్ష మందికి 72శాతం తగ్గాయని, గాయపడ్డ వారి సంఖ్య 76శాతం తగ్గాయని ట్రాఫిక్ భద్రతా కమిటీ వెల్లడించింది. అదేసమయంలో ప్రమాద సంబంధిత ఖర్చులలో SR10 బిలియన్లకు పైగా ($2.6 బిలియన్లు) ఆదా అయ్యాయని పేర్కొంది. ఈ మేరకు తూర్పు ప్రావిన్స్ ఎమిర్ ప్రిన్స్ సౌద్ బిన్ నైఫ్ వివరాలను విడుదల చేశారు. రోడ్డు భద్రతకు సంబంధించిన సంస్కరణలను అమలు చేయడం కారణంగానే మెరుగైన ఫలితాలు ఇస్తున్నాయని ప్రిన్స్ సౌద్ తెలిపారు.
డ్రైవర్లకు అవగాహన కల్పించడంతోపాటు ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాలను మరింత తగ్గించడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. 2024 చివరి నాటికి ట్రాఫిక్ భద్రతా పనితీరులో సౌదీలోని అన్ని ప్రాంతాలలో తూర్పు ప్రావిన్స్ మొదటి స్థానంలో ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!