స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీ నియామకాలు

- August 06, 2025 , by Maagulf
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీ నియామకాలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్. ప్రతీ ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా ఎస్‌బీఐ క్లర్క్ పరీక్ష కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈసారి మొత్తం 6589 పోస్టులు భర్తీ చేయడానికి ప్రకటన వెలువడింది. ఇందులో 5180 రెగ్యులర్ పోస్టులు కాగా, మిగతా పోస్టులు బ్యాక్‌లాగ్ కేటగిరీ కింద ఉన్నాయి.భర్తీ వివరాలు:పోస్టు పేరు: జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్)మొత్తం ఖాళీలు: 6589,ఆంధ్రప్రదేశ్: 310 పోస్టులు,తెలంగాణ: 250 పోస్టులు,మిగతా పోస్టులు దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ బ్రాంచ్‌లలో భర్తీ చేయబడతాయి.

అర్హతలు:
అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుండి డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.డిగ్రీ ఫైనల్ ఇయర్‌ లో చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.అభ్యర్థుల వయస్సు 20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. (రిజర్వేషన్ కేటగిరీకి వయస్సులో సడలింపులు వర్తిస్తాయి.ప్రిలిమినరీ, మెయిన్స్‌, లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. అప్లికేషన్‌ ఫీజు జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.750 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు. అధికారిక నోటిఫికేషన్ PDF ని ఆగస్టు 5, 2025న అధికారిక వెబ్‌సైట్ https://sbi.co.in/web/careers లో విడుదల చేశారు. ఈ జాబ్స్‌కి ఎంపికైన వారికి జీతం రూ.46000 వస్తుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు ధృవీకరించబడిన తేదీలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటిస్తుంది. అన్ని ముఖ్యమైన తేదీలు క్రింద పట్టికలో ఇవ్వబడ్డాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com