భారత్ లోని అన్ని ఎయిర్‌పోర్ట్స్‌లో హైఅలర్ట్
- August 06, 2025
న్యూ డిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలకు ఉగ్రముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. సంఘ వ్యతిరేక శక్తులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించాయి. నిఘా వర్గాల హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. అన్ని ఎయిర్‌పోర్టుల్లో హైఅలర్ట్ ప్రకటించారు. సెప్టెంబర్ 22, అక్టోబర్ 2 మధ్య ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విమానాశ్రయాలు, ఎయిర్‌స్ట్రిప్‌లు, హెలిప్యాడ్‌లు, వైమానిక దళ స్థావరాలు, ఫ్లైయింగ్ స్కూల్స్ వద్ద భద్రతను పెంచాలని సూచించారు.ఈ ఆదేశాలతో విమానాశ్రయాల వద్ద భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. టెర్మినల్స్, పార్కింగ్ ఏరియా తదితర ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను పెంచారు. ఎయిర్‌పోర్టులకు వెళ్లే మార్గాల్లోనూ తనిఖీలు ముమ్మరం చేశారు. విమానాశ్రయాల వద్ద ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్‌ను యాక్టివేట్ చేశారు. అవసరమైతే మాక్ డ్రిల్స్ నిర్వహించాలని పౌర విమానయాన భద్రతా బ్యూరో సంబంధిత అధికారులకు సూచించింది.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







