ఒమన్ లో రేడియో, టీవీ కంటెంట్ లకు పెరిగిన ఆదరణ..!!
- August 06, 2025
మస్కట్: ఒమన్ రేడియో, టీవీ ప్రోగ్రామింగ్ కంటెంట్ కు అక్కడి ప్రజలు ఆదరిస్తున్నారు. ఒమన్ సమాచార మంత్రిత్వ శాఖ సహకారంతో నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ జరిపిన ప్రజాభిప్రాయ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అక్కడి ప్రజలు రేడియో ఛానెల్ కంటెంట్ పై 76 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా, టీవీ ఛానెల్‌లకు సంబంధించి 73 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. మే 18 నుంచి జూన్ 18 వరకు ఒమన్ వ్యాప్తంగా సర్వే నిర్వహించారు. ముఖ్యంగా జాతీయ పర్వదినాలు, మతపరమైన కార్యక్రమాలు, వాతావరణ పరిస్థితులను కవర్ చేసే టీవీ కంటెంట్‌కు అత్యధికంగా 88 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వం మరియు పర్యాటక ప్రాజెక్టులు, సామాజిక సమస్యలతోపాటు పిల్లల కార్యక్రమాల కు సంబంధించిన కంటెంట్ కు 69 శాతం మంది మద్దతు పలికారు.
ఒమన్ టీవీ లో ప్రసారం అయ్యే మతౌన్, దిఫాఫ్, అల్ ఫహ్రాస్ వంటి మతపరమైన మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అల్-బైత్ , కున్నా హునా వంటి టాక్ షోలు.. అల్ వకీద్ మరియు అల్-మద్యూనిర్ వంటి రమదాన్ డ్రామా సిరీస్‌లకు అత్యధికంగా ఆదరణ లభించిందని సర్వేలో వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!