యూఏఈలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఫేక్ టిక్కెట్ల కలకలం..!!
- August 06, 2025
యూఏఈ: యూఏఈ వేదికగా జరగనున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు సంబంధించి ఫేక్ టిక్కెట్లు ఆన్ లైన్ వేదికల్లో హల్చల్ చేస్తున్నాయి. కొన్ని వెబ్ సైట్లు ఫేక్ టిక్కట్లను అమ్మకానికి పెట్టి, క్రికెట్ అభిమానులను నిండా ముంచుతున్నాయి. 11 వేల దిర్హమ్స్ కే 'VIP' పాస్‌ను అందిస్తామని ఒక వెబ్సైట్ పేర్కొంటుండగా.. అదే బాటలో ఇతర రీ సేల్ వెబ్సైట్లు కూడా క్రికెట్ అభిమానులను దోచుకుంటున్నాయి. మరికొన్ని వెబ్ సైట్లు 1,500 దిర్హామ్స్ కే జనరల్ అడ్మిషన్ పాసులు అందిస్తామని ప్రకటనలు ఇస్తూ ఆకర్షిస్తున్నాయి.
అయితే, సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్ కు సంబంధించి మ్యాచుల టిక్కెట్లను ఇంకా అధికారికంగా అమ్మడం ప్రారంభించలేదు. అసలు టిక్కెట్లను ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్ని ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. అయినా, కొన్ని ఫ్రాడ్ వెబ్ సైట్లు ఇదిగో టిక్కెట్లు అంటూ అప్పుడే అమ్మకాలను ప్రారంభించేశాయి.
ఫేక్ టిక్కెట్ల విషయంపై యూఏఈ పోలీసు డిపార్టుమెంట్ స్పందించింది. అనుమానస్పద లింకులపై క్లిక్ చేయవద్దని క్రికెట్ అభిమానులకు సూచించింది. వెబ్ సైట్ URLని చెక్ చేసుకోవాలని, కొన్ని స్పెల్లింగ్ మార్పులతో అధికారిక వెబ్ సైట్లను క్లోన్ చేసి సైబర్ మోసగాళ్లు మోసాలకు పాల్పడతారని, బ్యాంకు వివరాలు దొంగచాటుగా సేకరించి, క్షణాల్లో బ్యాంకు అకౌంట్లను ఖాలీ చేస్తారని హెచ్చరించారు. క్రికెట్ అభిమానులు జర జాగ్రత్త. ఫేక్ టిక్కెట్లను కొని సైబర్ నేరగాళ్ల వలలో పడవద్దని పోలీసులు ఒక అడ్వైజరీ జారీ చేశారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు







