ఎస్పీడబ్ల్యూ మహిళా జూనియర్ కళాశాలను పరిశీలించిన టిటిడి ఛైర్మెన్
- August 06, 2025
తిరుపతి: ఎస్పీడబ్ల్యూ మహిళా జూనియర్ కళాశాలలో అత్యవసరమైన పనులను సకాలంలో పూర్తి చేయాలని టిటిడి ఛైర్మెన్ బీ.ఆర్ నాయుడు ఆదేశించారు.మహిళా జూనియర్ కళాశాల జేఈవో వి.వీరబ్రహ్మం, టిటిడి బోర్డు మెంబర్ జి.భానుప్రకాష్ రెడ్డి కలిసి బుధవారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా టిటిడి ఛైర్మెన్ మాట్లాడుతూ, మహిళా జూనియర్ కళాశాలలో విద్యార్థినుల సమస్యలు తన దృష్టికి వచ్చాయని, విద్యార్థినులు ప్రాథమిక అవసరాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.కళాశాలలోని సమస్యలను టిటిడి జేఈవో, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ తన దృష్టికి తీసుకువచ్చారని, వాటి అన్నింటిపై నివేదిక తయారు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.విద్యార్థినులు చదువుకునేందుకు కళాశాల పరిసరాలు చాలా బాగున్నాయన్నారు.అదేవిధంగా ఈ కళాశాలలో ఉత్తీర్ణత శాతం చాలా అద్భుతంగా ఉందని అభినందించారు.
ముఖ్యంగా కళాశాలలో విద్యార్థినులకు హాస్టల్ సామర్థ్యాన్ని,వసతి సౌకర్యాన్ని పెంచాలని, వైద్య సౌకర్యాల పెంపు, వేడి నీటి కోసం సోలార్ వాటర్ హీటర్స్,ఈ-లెర్నింగ్ సెమినార్ హాల్ ఏర్పాటు, హాస్టల్ లో మరమ్మతులు, ఫిజికల్ ఎడ్యూకేషన్ సౌకర్యం తదితర అంశాలపై అధికారులు నివేదిక తయారు చేసి కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు టిటిడి ఛైర్మెన్ సూచించారు.
అంతకుముందు టిటిడి ఛైర్మెన్ బీ.ఆర్ నాయుడు అధికారులతో కలిసి కాలేజీ పరిసరాలను, వంట గది, హాస్టల్ ప్రాంతాలను తనిఖీ చేశారు.అటు తరువాత విద్యార్థినులు, తల్లిదండ్రులతో ఆయన మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో టిటిడి డిఈవో వెంకట సునీల్, ప్రిన్సిపాల్ డా.సి.భువనేశ్వరి, ఎస్.ఈ మనోహరం తదితరం అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







