తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం..
- August 07, 2025
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (RTC) మహిళల కోసం ఒక మంచి, కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా లక్షలాది మంది మహిళలు రోజువారీ ప్రయాణానికి ఆర్థిక భారం లేకుండా ప్రయాణిస్తున్నారు.ఇక తాజాగా, ఆర్టీసీ మహిళలకు ఉపాధి అవకాశాలను విస్తరించే దిశగా మరో గొప్ప ముందడుగు వేసింది.మహిళలకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ ఇచ్చి, తరువాత శాశ్వత ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సంస్థ సిద్ధమైంది. ముఖ్యంగా డ్రైవర్ పోస్టుల్లో మహిళల సంఖ్య తక్కువగా ఉండటంతో ఈ లోటును తీర్చే ప్రయత్నంగా ఈ కార్యక్రమం రూపొందించబడింది.
ప్రస్తుతం ఆర్టీసీలో మొత్తం 15 వేలకు పైగా డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. వీటిలో రిజర్వేషన్ నిబంధనల ప్రకారం కనీసం 33 శాతం అంటే సుమారు 5 వేల పోస్టులు మహిళలకు లభించాలి. కానీ వాస్తవంగా చూస్తే డ్రైవింగ్ శిక్షణ లేకపోవడం, హెవీ వెహికల్స్ నడిపేందుకు ధైర్యం లేకపోవడం వంటి కారణాలతో చాలా మంది మహిళలు డ్రైవర్ ఉద్యోగాలకు దూరంగా ఉంటున్నారు.ఈ పరిస్థితిని మార్చేందుకు టీజీఎస్ ఆర్టీసీ(TGSRTC) కీలకంగా వ్యవహరిస్తోంది. మహిళలకు ప్రత్యేక శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసి, అందులో డ్రైవింగ్ బేసిక్స్ నుంచి హెవీ వెహికల్స్ నడపడం వరకూ శిక్షణ ఇవ్వనున్నారు. ఇది పూర్తిగా ఉచితంగా ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత అర్హత సాధించినవారికి ఉద్యోగ అవకాశాలను కల్పించే దిశగా సంస్థ ముందడుగు వేసింది.
అయితే డ్రైవింగ్‌లో శిక్షణ లేకపోవడం, హెవీ వెహికల్స్ డ్రైవింగ్ అంటే భయం వల్ల మహిళలు ఆర్టీసీలో బస్సు డ్రైవర్ ఉద్యోగాల్లో చేరేందుకు ముందుకు రావడం లేదు.దీంతో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హెవీ వెహికిల్ డ్రైవింగ్ నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న మహిళలకు ఉచితంగా డ్రైవింగ్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు గాను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), ‘మెవో’ స్వచ్ఛంద సంస్థతో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హకీంపేట, సిరిసిల్లలో మహిళలకు డ్రైవింగ్‌లో ఉచితంగా శిక్షణ అందిస్తారు. ఇందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని అధికారులు తెలిపారు.
శిక్షణ పూర్తయిన తర్వాత సంబంధిత విద్యార్హత ఉన్న మహిళలని ఆర్టీసీలో డ్రైవర్లుగా నియమిస్తామని వెల్లడించారు. మిగిలిన వారికి ఐటీ కంపెనీల ప్రాంగణాల్లో బస్సు డ్రైవర్లుగానూ అవకాశాలు లభిస్తాయి అని వెల్లడించారు. మహిళా డ్రైవర్లు ఉంటే.. బస్సుల్లో భద్రత మరింత పెరుగుతుందని ఆర్టీసీ భావిస్తోంది. మహిళలు డ్రైవర్లుగా ఉంటే ప్రయాణికులు కూడా మరింత సురక్షితంగా భావిస్తారని.. ఆర్టీసీలో ప్రయాణాలు మరింత పెరుగుతాయని అంటున్నారు. త్వరలోనే దీనిపై ప్రకటన రానుందని తెలిపారు.
తాజా వార్తలు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి