‘ప్యారడైజ్’ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

- August 07, 2025 , by Maagulf
‘ప్యారడైజ్’ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

నేచురల్ స్టార్ నాని, ‘దసరా’ ఫేమ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలకు మరింత ఊపునిస్తూ, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఒక కొత్త ప్రచార పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈ సినిమాలోని ప్రతి పాత్రను రెండు వేర్వేరు పోస్టర్ల ద్వారా పరిచయం చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఉదయం దర్శకుడి ఆలోచనలోని పాత్రను చూపిస్తే, సాయంత్రం ఆ పాత్ర తెరపై ఎలా ఉండబోతుందో చూపిస్తామని ఓదెల వివరించారు. ఈ ప్రత్యేకమైన ప్రచారం సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచింది.

ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసం ఇటీవలే ఫైట్ మాస్టర్ రియల్ సతీశ్ నేతృత్వంలో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు. ఈ సన్నివేశం సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో ప్రముఖ హిందీ నటుడు రాఘవ్ జుయల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ‘ది ప్యారడైజ్’ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్‌తో కలిపి మొత్తం 8 భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 26న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ కొత్త ప్రచార విధానం సినిమాకు ఎంతవరకు సహాయపడుతుందో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com