ఒమన్ లో కీలక వాటర్ నెట్వర్క్ ప్రాజెక్టులు పూర్తి..!!
- August 08, 2025
అల్-ముధైబి: ఉత్తర అషర్కియా గవర్నరేట్‌లో కీలమైన వాటర్ నెట్ వర్క ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసుకుంటోంది. అల్ ముధైబిలోని వాడి అండమ్ గ్రామాలలో నామా వాటర్ సర్వీసెస్ ద్వారా అమలవుతున్న ఈ వాటర్ నెట్వర్క్ ప్రాజెక్ట్ ను RO 3,668,000 తో నిర్మిస్తున్నారు. నిర్మాణ పనులు దాదాపు 93 శాతం దాటాయని తెలిపారు.
వాడి అండమ్ వాటర్ నెట్వర్క్ ప్రాజెక్ట్‌లో భాగంగా అల్-హబాత్ గ్రామంలో ఉన్న ఖద్రా బని దఫా పంపింగ్ స్టేషన్ విస్తరణ పనులతోపాటు 90 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో మూడు కొత్త ఫైబర్‌గ్లాస్ ట్యాంకులను నిర్మిస్తున్నారు. వీటితోపాటు అల్-వాషల్, అల్-ఫులైజ్ గ్రామాలలో రెండు బూస్టర్ పంపింగ్ స్టేషన్లు రానున్నాయి. దాదాపు 102 కిలోమీటర్లు మేర ఉండే పైప్ లైన్ ద్వారా వాడి అండమ్ లోని తొమ్మిది గ్రామాలలో మంచినీటి అవసరాలను తీర్చుతుందని పేర్కొన్నారు.
రెండవ దశను RO 15,132,000 తో 2027 నాటికి పూర్తి చేయనున్నారు. ఇందులో 40 కి.మీ ట్రాన్స్మిషన్ పైప్‌లైన్, 217 కి.మీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, 4,065 గృహ కనెక్షన్లు, పంపింగ్ స్టేషన్ మరియు ఎలివేటెడ్ ట్యాంక్ ఉన్నాయి. మరోవైపు అల్-తయీన్ విలాయత్‌లలో వాటర్ నెట్వర్క్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోందని గమనించాలి. 36 నెలల ప్రాజెక్టులో అల్-ముధైబీలోని అల్-జర్దా, దమాలోని మహ్లా మరియు అల్-తయీన్ మధ్య 77.85 కి.మీ నీటి ప్రసార పైప్‌లైన్, 3 వేల నుండి 10 వేల క్యూబిక్ మీటర్ల మధ్య నిల్వ సామర్థ్యం కలిగిన ఏడు పంపిణీ ట్యాంకులు, అల్-జర్దా మరియు అల్-రహ్బా ప్రాంతాలలో రెండు పంపింగ్ స్టేషన్లు ఉంటాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







