ప్రధాని మోదీకి చైనా స్వాగతం

- August 08, 2025 , by Maagulf
ప్రధాని మోదీకి చైనా స్వాగతం

న్యూ ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనాలో పర్యటించనున్నారు. ఈ నెల 31, సెప్టెంబర్ 1 తేదీల్లో జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(SCO) సమావేశంలో పాల్గొనేందుకు ఆయన చైనా వెళ్తున్నారు. ఏడేళ్ల తర్వాత మోదీ చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి. చివరిసారిగా ఆయన 2018లో చైనాలో పర్యటించారు. గల్వాన్ లోయ ఘర్షణల తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో, ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.

గల్వాన్ లోయ ఘర్షణల అనంతరం భారత్-చైనా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.ఈ సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య, రక్షణ సంబంధాలు క్షీణించాయి. ప్రస్తుతం ఈ సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రధాని మోదీ పర్యటన జరుగుతోంది. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలు, సరిహద్దు వివాదాలు, వాణిజ్య సంబంధాలపై చర్చించే అవకాశం ఉంది.

ప్రధాని మోదీ పర్యటనకు చైనా ప్రభుత్వం సాదరంగా స్వాగతం పలికింది. ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి ఒక మంచి అవకాశంగా చైనా భావిస్తోంది. ఎస్‌సీఓ సమావేశం సందర్భంగా పుతిన్, జిన్‌పింగ్‌తో పాటు ఇతర ప్రపంచ నేతలతో మోదీ భేటీ కానున్నారు. ఈ భేటీలు ఇరు దేశాల మధ్య ఉన్న అపార్థాలను తొలగించి, భవిష్యత్తులో శాంతియుత సంబంధాలకు దారి తీస్తాయని ఆశిస్తున్నారు. ఈ పర్యటన ద్వారా ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు కొత్త మలుపు తిరుగుతాయా లేదా అనేది వేచి చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com