మహేష్ 50వ బర్త్ డే..SSMB29 సినిమా అప్డేట్
- August 09, 2025
మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో భారీ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అడ్వెంచరస్ జానర్ లో రాజమౌళి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ షూటింగ్ కూడా పూర్తయ్యాయి. అయితే ఈ సినిమాపై ఎలాంటి అధికారిక అప్డేట్స్ ఇప్పటివరకు రాజమౌళి ఇవ్వలేదు. ఫ్యాన్స్ ఏమో ఈ సినిమా కోసం, సినిమా అప్డేట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
నేడు మహేష్ బాబు 50వ పుట్టిన రోజు సందర్భంగా రాజమౌళి SSMB29 సినిమా పై అప్డేట్ ఇచ్చారు. తన సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి పోస్ట్ చేసారు.
రాజమౌళి తన ట్వీట్ లో.. భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులకు, మహేష్ అభిమానులకు.. మేము షూటింగ్ ప్రారంభించి చాలా కాలం అయింది. ఈ సినిమా గురించి తెలుసుకోవాలనే మీ ఆసక్తిని మేము అభినందిస్తున్నాము. అయితే ఈ సినిమా కథ, దాని పరిధి చాలా పెద్దది. కేవలం ఫొటోలు, ప్రెస్ కాన్ఫరెన్స్లు దానికి న్యాయం చేయలేవని నేను భావిస్తున్నాను. మేము సృష్టిస్తున్న ప్రపంచం గురించి మీకు చెప్పడానికి మేము ఒకదానిపై పనిచేస్తున్నాము. నవంబర్ 2025లో అది రిలీజ్ చేస్తాము. ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా ఉండేలా మేము ప్రయత్నిస్తున్నాము. మీ ఓపికకు అందరికీ ధన్యవాదాలు అని తెలిపాడు.
ఇక మహేష్ బాబు కూడా ఈ సినిమాపై అప్డేట్ ఇస్తూ మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు. నేను కూడా మీ అందరిలాగే ఎదురుచూస్తున్నాను. నవంబర్ లో రివీల్ చేస్తామంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో మహేష్ మెడలో నంది, త్రిశూలం, ఢమరుకం, మూడు నామాలు ఉన్న లాకెట్ వేసుకున్నాడు.
దీంతో నవంబర్ లో రాజమౌళి–మహేష్ బాబు సినిమాకు సంబంధించి గ్లింప్స్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఇక ఫ్యాన్స్ సినిమా నుంచి ఏం రిలీజ్ చేయకపోయినా ఏదో ఒక అప్డేట్ ఇచ్చారులే అని సంతోషపడుతూ ఈ ట్వీట్ ని వైరల్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. త్వరలో కెన్యా అడవుల్లో షూటింగ్ జరగనుంది. హైదరాబాద్ లో ఈ సినిమా కోసం భారీ కాశీ సెట్ వేశారు.
తాజా వార్తలు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి