హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్..
- August 09, 2025
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో భారీ వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. గురువారం, శుక్రవారం రాత్రి సమయాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. రహదారులపైకి భారీగా వర్షపు నీరు చేయడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారులపై గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది.
భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతోపాటు నగరం మొత్తం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాల కురుస్తుండటంతో జీహెచ్ఎంసీ, హైడ్రా అప్రమత్తమైంది. నగర వాసులకు ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే, శనివారం సాయంత్రం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలైన సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, కామారెడ్డి, సిద్ధిపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో.. అదేవిధంగా నల్గొండ, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, వరంగల్, ములుగులోని పలు ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!