తొట్లవల్లూరులో కాన్సర్ పరీక్షల కోసం ఆధునిక మొబైల్ ల్యాబ్ ప్రారంభం
- August 09, 2025
అమరావతి: గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా మహిళల్లో వివిధ కాన్సర్ లు పెరుగుతున్న దృష్ట్యా ముందు జాగ్రత్త గా వారి వద్దకే వెళ్లి స్క్రీనింగ్ చేసేందుకు అవసరమైన ఒక అధునాతన మొబైల్ ల్యాబ్ ను మచిలీపట్టణం ప్రాంతంలో స్థానిక భారత్ ఎలెక్ట్రానిక్స్ లిమిటెడ్ వారి సి.ఎస్.ఆర్ నిధులు మరియు MPLADS నిధులతో ఏర్పాటు చేస్తున్నాం.
క్యాన్సర్ ను తొలిదశలో గుర్తించి వైద్యం చేయించుకుంటే 90 శాతం మరణాలను అరికట్టవచ్చని నివేదికలు తెలుపుతున్నాయి. 35 సంవత్సరాలు దాటినా ప్రతి మహిళా మూడేళ్ళకో సారైనా మామోగ్రాం పరిక్షలు చేయించుకోవాలి. సాధారణంగా ప్రతి ముగ్గురిలో ఇద్దరు వ్యాధి ముదిరిన తర్వాత మాత్రమే డాక్టర్లను సంప్రదిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు .
అవగాహనా లేకపోవడం, నిరక్షరాస్యత, భయం, వివిధ రకాల అపోహల కారణంగా క్యాన్సర్ నిర్ధారణ ఆలస్యం అవుతోంది. క్యాన్సర్ నివారణపై అవగాహన ఉండి ప్రారంభ దశలోనే గుర్తించ గలిగితే చాలావరకు వ్యాధిని అరికట్టి మరణాలు లేకుండా చేయొచ్చు.
ఒక వ్యాధి వలన ఒక ప్రాణం పొతే ఆ కుటుంబానికి ఎంత నష్టమో మనకు తెలుసు. ఒక తల్లి చనిపోతే ఆ పిల్లలు అనాధ లవుతారు. కాబట్టి ప్రాణం చాలా ముఖ్యం. మహిళలు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయకుండా జాగ్రత్త వహించడం వారి కుటుంబాలకు చాలా అవసరం.
అవగాహనతోనే క్యాన్సర్ ని దూరం చేయగలం. క్యాన్సర్ ఏ స్థాయిలో ఉన్నా మనోధైర్యం తో ఎదుర్కోవాలి. అలా ఎదుర్కొని క్యాన్సర్ ని జయించి సాధారణ జీవితం గడుపుతున్న వారిని సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం. వారిని ఆదర్శంగా తీసుకొని క్యాన్సర్ పేషంట్లు ముందుకు పోవాలి.క్యాన్సర్ కు భయపడే రోజులు పోయాయని మనం గుర్తించాలి. క్యాన్సర్ రహిత కృష్ణా జిల్లా ను చూడటమే మన ధ్యేయంగా పనిచేయాలి.
అత్యంత ఆధునిక యంత్ర పరికరాలు ఉన్న ఈ మొబైల్ ల్యాబ్ లో వివిధ పరీక్షలతో పాటు కాన్సర్ అనుమానిత లక్షణాలు కనిపిస్తే, వెంటనే పరీక్ష కోసం శరీరం నుండి నమూనాలు సేకరిస్తారు. ఈ నమూనాల ద్వారా కాన్సర్ ఉందొ లేదో తెలిసిపోతుంది కాబట్టి వ్యాధి నిర్ధారణ అయితే వెంటనే తగిన చికిత్స ను సూచించడం జరుగుతుంది.
గ్రామీణ ప్రాంతాల లోని పేద మహిళలు చాల మంది తమ యొక్క అనారోగ్య సమస్యలను చెప్పుకోవ డానికి సంకోచిస్తూ ఉంటారు. వారి యొక్క ఆర్ధిక, సామజిక మరియు కుటుంబ పరిస్థితులే ఇందుకు కారణం అయి ఉంటాయి. దీనితో వ్యాధి ముదురుతున్నా పట్టించుకోరు.
అదే వారు ఉండే ప్రాంతానికే ఒక మొబైల్ ల్యాబ్ వెళ్ళినట్లయితే, చాలా మంది మహిళలు ముందుకు వచ్చి పరిక్షలు చేయించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 35 దాటిన ప్రతి మహిళా పరీక్షలు చేయించుకోవలసిన అవసరం ఉంది. కొన్ని కాన్సర్ లను ముందుగా గుర్తిస్తేనే, చికిత్స సులభం అవుతుంది. ఈ మొబైల్ ల్యాబ్ ద్వారా సోనో మామోగ్రామ్, డిజిటల్ మామోగ్రామ్, పాప్సిమీర్ తదితర పరీక్షలు నిర్వహించ వచ్చు.
కేవలం పరిక్షలు నిర్వహించడమే కాకుండా, కాన్సర్ పట్ల మహిళలకు అవగాహన కల్పిస్తారు. టెస్ట్ చేసిన తర్వాత కాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయితే తదుపరి చికిత్సలైన కీమో థెరపీ. రేడియేషన్ థెరపి అందించే ఏర్పాటు చేస్తారు.
ఎంతో మంచి ఉద్దేశ్యం తో ఏర్పాటు చేసిన ఈ మొబైల్ క్యాన్సర్ వాన్ ను తొట్లవల్లూరు గ్రామ మహిళలు సద్వినియోగం చేసుకొని, అవసరమైన పరిక్షలు చేయించుకొని, ఆరోగ్యంగా ఉండాలని ఎంపి బాలశౌరి ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి పామర్రు నియోజక వర్గంలోని అన్ని గ్రామాలలో కూడా కాన్సర్ బస్ తిరిగి కాన్సర్ పరిక్షలు నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!