కువైట్ లో టెలికాం టవర్లు, బ్యాంకులే లక్ష్యంగా సైబర్ అటాక్స్..!!
- August 11, 2025
కువైట్ః కువైట్ లో భారీ సైబర్ క్రైమ్ లకు పాల్పడుతున్న ముఠా నెట్ వర్క్ ను అధికారులు ఛేదించారు. టెలికాం టవర్లు, బ్యాంకులపై దాడులకు పాల్పడిన ఆఫ్రికన్ జాతీయతకు చెందిన అంతర్జాతీయ సైబర్ క్రైమ్ ముఠాను అరెస్టు చేసినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సైబర్ క్రైమ్ ముఠా నెట్‌వర్క్‌లను హ్యాక్ చేయడానికి మరియు బ్యాంక్ అకౌంట్ల నుంచి నిధులను దొంగిలించడానికి బ్యాంకు సిబ్బంది పేరిట ఫేక్ మెసేజులు, కాల్స్ చేస్తున్నాయని అధికారులు తెలిపారు. ఇందు కోసం ముఠా అధునాతన ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. రైడ్స్ సందర్భంగా వాటిని గుర్తించి, స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
అంతకుముందు, సాల్మియాలో ఒక వాహనం నుండి అనుమానాస్పద సంకేతాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అధికారులు వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించగా, డ్రైవర్ పారిపోవడానికి ప్రయత్నించి, అనేక కార్లను ఢీకొట్టాడు. నిందితులపై చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







