ఖతార్ లో మూడు వాణిజ్య సంస్థలపై చర్యలు..!!

- August 11, 2025 , by Maagulf
ఖతార్ లో మూడు వాణిజ్య సంస్థలపై చర్యలు..!!

దోహా: ఖతార్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) నిబంధనలు ఉల్లంఘించిన మూడు వాణిజ్య సంస్థలను 30 రోజుల పాటు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ట్రేడ్ మరియు షిప్పింగ్ సేవలు అందించే అల్-బహార్ అల్-అబ్యాద్, ఎలివేటర్ల సంస్థ సిల్వర్ ఫౌజీ మరియు గ్లాస్ డెకర్ సేవలు అందించే MBI లపై చర్యలు తీసుకున్నారు. 
ఆయా సంస్థలు వినియోగదారుల రక్షణపై 2008 లో రూపొందించిన చట్ట నిబంధనలను ఉల్లంఘించాయని తెలిపింది. తమ కస్టమర్లకు ఇచ్చిన హామీలను ఉల్లంఘించినందుకు, జరిమానా తోపాటు సీజింగ్ చర్యలు తీసుకున్నట్టు తెలిపింది. వినియోగదారుల హక్కులను కాపాడటానికి మరియు సురక్షితమైన వాణిజ్య వాతావరణాన్ని పెంపొందించడానికి నిరంతరం తనిఖీలను కొనసాగిస్తామని తెలిపింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com