బహ్రెయిన్ లో 130 మందిపై బహిష్కరణ వేటు..!!
- August 11, 2025
మనామా: బహ్రెయిన్ లో ఆగస్టు 3 మరియు 9వ తేదీల మధ్య 1,089 తనిఖీలను నిర్వహించినట్లు లేబర్ మార్కెట్ నియంత్రణ సంస్థ ప్రకటించింది. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన 130 మందిని గుర్తించి వారిని బహ్రెయిన్ నుంచి బహిష్కరించినట్లు తెలిపింది.
అన్ని గవర్నరేట్లలోని వివిధ దుకాణాలలో 1,076 తనిఖీలు నిర్వహించగా, వివిధ ప్రభుత్వ సంస్థల సమన్వయంతో 13 సంయుక్త తనిఖీలు జరిగాయని తెలిపింది. క్యాపిటల్ గవర్నరేట్‌లో ఒకటి, ముహారక్లో మూడు, నార్తర్న్ గవర్నరేట్‌లో నాలుగు మరియు సదరన్ గవర్నరేట్‌లో ఐదు చొప్పున సంయుక్త క్యాంపెయిన్ లను నిర్వహించినట్టు పేర్కొంది.
చట్టవిరుద్ధమైన కార్మిక పద్ధతులకు వ్యతిరేకంగా తమ ప్రయాత్నాలు కొనసాగుతాయని తెలిపారు. ఏదైనా సమాచారాన్ని వెబ్సైట్, హాట్‌లైన్ నెంబర్ 17506055 కు కాల్ చేయడం ద్వారా ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్‌లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







