ఏపీ: అమరావతి పేరుతో కొత్త జిల్లా
- August 12, 2025
అమరావతి: ప్రజావసరాలకు అనుగుణంగా జిల్లాల సరిహద్దుల మార్పుకు సంబంధించి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కొన్ని జిల్లాల సరిహద్దులు, పేర్లు, మండలాల మార్పులపై మంత్రివర్గ ఉప సంఘం కసరత్తు చేస్తుండగా, అవి స్వరూపం మార్చుకోనున్నాయి జిల్లాల సంఖ్య 26 నుంచి 32కి పెరిగే అవకాశం ఉంది.. కృష్ణా జిల్లా నుంచి పెనమలూరు.. గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలోకి మార్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.. అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలు మళ్లీ ప్రకాశం జిల్లాలోకి మారనున్నట్లు సమాచారం. కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పాటుకు అవకాశం ఉండగా, అమరావతి, గూడూరు, ఆదోని, పలాస, మదనపల్లి జిల్లాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. జిల్లా కేంద్రాల దూరం తగ్గించడం.. పాలనా సౌలభ్యం సంబంధించి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఉన్న జిల్లాల నుంచి కొత్త జిల్లాలోకి పలు నియోజక వర్గాలు మారనున్నాయు. త్వరలో మంత్రి వర్గ ఉపసంఘం సమావేశమై.. తాజా పరిస్థితులకు అనుగుణంగా కొత్త జిల్లాలు..సరిహద్దు మార్పులపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.
ప్రతిపాదిత జిల్లాలు ఏర్పడితే వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు పలాస జిల్లాలో ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం నియోజకవర్గాలు వస్తాయి శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం, ఆముదాలవలస, నరసన్నపేట, ఎచ్చెర్ల, రాజాం. మన్యం పార్వతీపురం జిల్లాలో పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ. విజయనగరం జిల్లాలో విజయనగరం, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, శృంగవరపుకోట, బొబ్బిలి.. విశాఖపట్నం జిల్లాలో భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్, గాజువాక, పెందుర్తి, అల్లూరి సీతారామరాజు అరకు జిల్లాలో అరకు, పాడేరు, మాడుగుల అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట, తుని. కాకినాడజిల్లాలొ కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, రామచంద్రాపురం. తూర్పు గోదావరి రాజమహేంద్ర వరం జిల్లాలో రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, అనపర్తి, రాజానగరం, రంపచోడవరం. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం: అమలాపురం, ముమ్మిడివరం, గన్నవరం, రాజోలు, కొత్తపేట, మండపేట. పశ్చిమ గోదావరి నరసాపురం జిల్లాలో తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం. ఏలూరు జిల్లాలో ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, గోపాలపురం, చింతలపూడి, పోలవరం.
కృష్ణా మచిలీపట్నం జిల్లాలో కైకలూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు.. ఎన్టీఆర్ విజయవాడ జిల్లాలో విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, తిరువూరు, నూజివీడు, గన్నవరం, పెనమలూరు, మైలవరం. అమరావతి జిల్లాలో పెదకూర పాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ. గుంటూరు జిల్లాలో గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, తెనాలి, పొన్నూరు, ప్రత్తిపాడు. బాపట్ల జిల్లాలో బాపట్ల, వేమూరు, చీరాల, రేపల్లె, పర్చూరు. పల్నాడు నరసరావుపేట జిల్లాలో నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుకొండ. మార్కాపురం జిల్లాలో మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి. ఒంగోలు జిల్లాలో ఒంగోలు, అద్దంకి, సంతనూతల పాడు, కొండెపి, కందుకూరు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కావాలి, కోవూరు, ఉదయగిరి. గూడూరు జిల్లాలో గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి, సూళ్లూరుపేట.
శ్రీ బాలాజీ తిరుపతి జిల్లాలో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, చంద్రగిరి. చిత్తూరు జిల్లాలో చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, పలమనేరు, కుప్పం. మదనపల్లి జిల్లాలో మదనపల్లి, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లి. శ్రీసత్యసాయి హిందూ పురం జిల్లాలో హిందూపురం, కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుగొండ, మడకశిర, అనంతపురం జిల్లాలో అనంతపురం, రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, రాప్తాడు, శింగనమల, తాడిపర్తి. ఆదోని జిల్లాలో ఆదోని, పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం. కర్నూలు జిల్లాలో కర్నూలు, డోన్, నందికొట్కూరు, కోడుమూరు నంద్యాల జిల్లాలో నంద్యాల, శ్రీశైలం, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం.. వైఎస్సార్ కడప జిల్లాలో కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, పులివెందుల.అన్నమయ్య రాజంపేట జిల్లాలో రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, బద్వేలు నియోజకవర్గాలుంటాయి.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







