బంగారం పై సుంకాలు ఉండవు.. ట్రంప్ కీలక ప్రకటన
- August 12, 2025
అమెరికా: అంతర్జాతీయ మార్కెట్లను కొన్ని రోజులుగా కలవరపెడుతున్న ఊహాగానాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెరదించారు. బంగారం దిగుమతులపై తమ ప్రభుత్వం ఎలాంటి సుంకాలు (టారిఫ్‌లు) విధించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' లో ఒకే ఒక్క వాక్యంతో "బంగారంపై సుంకాలు ఉండవు!" అని పోస్ట్ చేశారు. దీంతో పసిడి వాణిజ్యంపై నెలకొన్న గందరగోళానికి తెరపడినట్లయింది. ఇటీవల స్విట్జర్లాండ్ నుంచి దిగుమతి అయ్యే 1 కిలోగ్రాము, 100 ఔన్సుల గోల్డ్ బార్స్‌పై అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం సుంకాలు విధించవచ్చని ఒక వార్త హల్చల్ చేసింది. ఈ వార్తలతో బంగారంపై దేశాలవారీగా సుంకాలు విధిస్తారేమోనన్న ఆందోళనలు మొదలయ్యాయి. ఈ రకం గోల్డ్ బార్స్‌ను కమోడిటీ ఎక్స్ఛేంజ్లో ఫ్యూచర్స్ కాంట్రాక్టుల కోసం, అలాగే ఆభరణాల తయారీ, పారిశ్రామిక అవసరాల కోసం ఎక్కువగా వినియోగిస్తారు. సుంకాలు విధిస్తే అంతర్జాతీయంగా బంగారం సరఫరాపై ప్రతికూల ప్రభావం పడుతుందని స్విస్ తయారీదారుల సంఘం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా ప్రకటనతో మార్కెట్ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







