నారాయణమూర్తిని వన్ మ్యాన్ ఆర్మీగా అభివర్ణించిన త్రివిక్రమ్

- August 12, 2025 , by Maagulf
నారాయణమూర్తిని వన్ మ్యాన్ ఆర్మీగా అభివర్ణించిన త్రివిక్రమ్

హైదరాబాద్: సీనియర్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రముఖ నటుడు-దర్శకుడు ఆర్. నారాయణమూర్తి పై అభినందనల జల్లు కురిపించారు. ఇటీవల నారాయణమూర్తి దర్శకత్వంలో వచ్చిన కొత్త చిత్రం ‘యూనివర్సిటీ పేపర్ లీక్’ ను త్రివిక్రమ్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రత్యేకంగా వీక్షించారు. అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

త్రివిక్రమ్ మాటల ప్రకారం, నారాయణమూర్తి సినీ పరిశ్రమలో ఎన్నో దశాబ్దాలుగా ప్రయాణిస్తున్న గొప్ప వ్యక్తి. ఆయన వన్ మ్యాన్ ఆర్మీ అని, ఆయన సినిమాల్లో రాజు ఆయనే, సైన్యాధిపతి ఆయనేనని అన్నారు. కథ ఆలోచన నుంచి విడుదల వరకు ఒక్కరే అన్నిటికీ బాధ్యత తీసుకుంటారు,” అంటూ ఆయన ప్రశంసలు కురిపించారు.

త్రివిక్రమ్ అభిప్రాయపడ్డారు, “నారాయణమూర్తి ప్రతి చిత్రానికి ఒక సామాజిక సందేశాన్ని ఇస్తారు. అణచివేతకు గురైనవారి తరఫున మాట్లాడే గొంతుక ఆయనది. అలాంటి గొంతుకలు వినిపించకపోతే, ఈ ప్రపంచం ఏకపక్ష ధోరణిలోకి దూసుకుపోతుంది.”

తాను స్వయంగా కొన్ని సందర్భాల్లో రాజీ పడాల్సి వచ్చిందని పేర్కొన్న త్రివిక్రమ్, “ఒక సినిమాలోని పాత్ర కోసం నేను నారాయణమూర్తిని అనుకున్నా. కానీ పారితోషికంతో ఆయనను కొనలేమని ఎవరో చెప్పారని అన్నారు. ఈ వ్యాఖ్య ద్వారా త్రివిక్రమ్, నారాయణమూర్తి విలువలు, నిబద్ధత గురించి ప్రత్యేకంగా వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com