దేశంలోనే తొలి ఆటోమేటెడ్ పార్కింగ్ రెడీ
- August 12, 2025
హైదరాబాద్: హైదరాబాద్‌లో పార్కింగ్ సమస్యలంటే ఏ మోటారు వాహనదారి కైనా టెన్షన్. ముఖ్యంగా నాంపల్లిలో అయితే, పార్కింగ్ కోసం గంటల తరబడి తిరగాల్సిన పరిస్థితి. అయితే ఆ బాధలకు ఇక చెక్ పడనున్నట్టు కనిపిస్తోంది.నాంపల్లి మెట్రో స్టేషన్ సమీపంలో నిర్మించిన మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కాంప్లెక్స్ తో ఈ సమస్యకు చెక్ పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో, ఈ ప్రాజెక్టు ప్రజల వినియోగానికి సిద్ధంగా ఉంది.ఈ కాంప్లెక్స్ ప్రత్యేకతేంటంటే, ఇది దేశంలోనే మొట్టమొదటి జర్మన్ పాలిస్ పార్కింగ్ టెక్నాలజీ ఆధారంగా నిర్మించబడింది. దీని వల్ల తక్కువ స్థలంలో ఎక్కువ వాహనాలు పార్క్ చేయగలగడం సాధ్యమవుతుంది.
కేవలం కార్లు పెట్టడానికే కాదు, వినోదానికి కూడా ఈ ప్రాజెక్టులో చోటుంది. మొత్తం 15 అంతస్తుల కాంప్లెక్స్‌లో 10 అంతస్తులు పార్కింగ్‌కు, మిగిలిన ఐదు అంతస్తులు షాపింగ్ మాల్స్, థియేటర్‌ల కోసం కేటాయించారు.ఈ కాంప్లెక్స్‌లో 200 పైగా కార్లు, సుమారు 200 టూ వీలర్లు పార్క్ చేయవచ్చు. సౌకర్యవంతమైన లిఫ్ట్‌లు, కంప్యూటరైజ్డ్ కంట్రోల్‌తో పార్కింగ్ అనుభవం ఒక అంతర్జాతీయ స్థాయి ఫీలింగ్ ఇస్తుంది.
ఈ కాంప్లెక్స్ 11వ అంతస్తులో నగర వీక్షణ గ్యాలరీ కూడా ఉంది. హైదరాబాద్ అందాలను ఎత్తుగా నిలబెట్టి చూసే అవకాశం ఇది.ఈ ప్రాజెక్టును పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో నిర్మించారు. ప్రాజెక్టు ఆలస్యం అయినా, ఇప్పుడు పూర్తిగా సిద్ధంగా ఉంది.హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ, ఇది దేశానికి ఒక మోడల్ ప్రాజెక్టు అవుతుంది. నగర వాసులకు ఇది అత్యాధునిక పార్కింగ్ అనుభవాన్ని అందించనుంది అని చెప్పారు.ప్రముఖ వాణిజ్య ప్రాంతమైన నాంపల్లిలో ట్రాఫిక్ ఒత్తిడికి ఇది ఉపశమనం. ఇక పై పార్కింగ్ కోసం భయపడాల్సిన పనిలేదు. నగర జీవనశైలి మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్‌లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







