రైల్వే ప్రయాణికులకు శుభవార్త...
- August 12, 2025
న్యూ ఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. రైల్వే స్టేషన్లలో ఇకపై ఉచితంగా వై-ఫై సర్వీసులను పొందవచ్చు.భారత దేశవ్యాప్తంగా 6,115 రైల్వే స్టేషన్లలో ప్రయాణీకులకు ఉచిత వై-ఫై సౌకర్యాలను అందించనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.ఈ మేరకు కేంద్ర మంత్రి వైష్ణవ్ రాజ్యసభకు వివరించారు. భారత రైల్వే అందించే దాదాపు అన్ని రైల్వే స్టేషన్లలో 4G/5G కవరేజ్ ఉంది.
ఈ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు అందించే నెట్‌వర్క్‌లను డేటా కనెక్టివిటీ కోసం కూడా ప్రయాణికులు వినియోగిస్తున్నారు. తద్వారా ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. రైల్వే స్టేషన్లలో ఉచిత వై-ఫై సేవలు అందుబాటులోకి రాబోయే రైల్వే స్టేషన్లు వివరాలేంటి? ప్రయాణికులు ఎలా వై-ఫై సర్వీసును యాక్సస్ చేయొచ్చు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఫ్రీ Wi-Fi ఎలా యాక్సెస్ చేయాలి?
- మీ స్మార్ట్‌ఫోన్‌లో Wi-Fi మోడ్‌ను ఆన్ చేయండి.
- ‘RailWire’ Wi-Fiకి కనెక్ట్ అవ్వండి.
- SMS OTP కోసం మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి Wi-Fi ఎనేబుల్ చేయండి.
- ప్రయాణీకుల కోసం రైల్వే స్టేషన్లలో ఉచిత Wi-Fi ద్వారా HD వీడియోలను వీక్షించవచ్చు.
- ఎంటర్టైన్మెంట్ కంటెంట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. సినిమాలు, టీవీ షోలు చూడొచ్చు.
- ఆఫీసు సంబంధిత పనులను కూడా పూర్తి చేయొచ్చు.
ఏయే స్టేషన్లలో ఫ్రీ Wi-Fi ఉందంటే?
న్యూఢిల్లీ, ముంబై సెంట్రల్, చెన్నై సెంట్రల్, పూణే, కోల్‌కతా, అహ్మదాబాద్, హైదరాబాద్ వంటి అన్ని ప్రధాన టైర్ 1 నగరాల్లోని రైల్వే స్టేషన్లలో ఫ్రీ వై-ఫై సర్వీసు అందుబాటులో ఉంది. అలాగే, సూరత్, వడోదర, రాజ్‌కోట్, మీరట్, భోపాల్ తరహా టైర్ 2 నగరాలు, రోహ్తక్, కటక్ వంటి టైర్ 3 నగరాల్లోని స్టేషన్లలో సైతం వై-ఫై ఫెసిలిటీ అందుబాటులో ఉంది.
భారతీయ రైల్వే స్టేషన్లలో ఫ్రీ Wi-Fi అనేది రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ (PSU) RailTel పేరుతో ‘RailWire’ బ్రాండ్ ద్వారా అందిస్తోంది.ఈ ప్రాజెక్టు విస్తరణ కోసం రైల్‌టెల్ గతంలో గూగుల్, టాటా ట్రస్ట్ వంటి సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కానీ, ఇప్పుడు పీఎస్‌యూ రైల్‌వైర్ యాక్సెస్‌ను అందిస్తోంది.
తాజా వార్తలు
- సౌదీలో జీసీసీ వాహనాల గడువు ముగింపు..!!
- ఒమన్‌లో ముగ్గురు ఆసియన్లు అరెస్ట్..!!
- కువైట్‌లో చాలెట్లలో అక్రమ కార్మికులపై చర్యలు..!!
- బహ్రెయిన్‌లో డ్యామేజ్ అసెస్మెంట్ సర్టిఫికెట్ సేవలు ఆన్‌లైన్‌లోకి..!!
- గల్ఫ్ భద్రతకు దౌత్యం, ప్రాంతీయ సహకారం అవసరం: ఖతార్
- రాస్ అల్ ఖైమాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, ట్రక్కు ఢీకొని 11 మంది మృతి..!!
- ఉమ్ అల్ ఖువైన్లో ట్రక్కుల రాకపోకలపై నిషేధం..!!
- కువైట్‌లో 360 మాల్ సమీపంలో రోడ్ మూసివేత..!!
- ఒమన్‌లో జ్యువెలరీ కొనుగోలుదారులకు ఊరట..!!
- సౌదీ అరేబియాలో ఒకే నెలలో భారీగా ఆరిజిన్ సర్టిఫికెట్లు జారీ..!!







