బ్యాంక్ అఫ్ బరోడాలో జాబ్స్..
- August 12, 2025
బ్యాంకింగ్ రంగంలో లైఫ్ సెట్ చేసుకుందాం అనుకుంటున్నారా? అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా ఆ అవకాశాన్నీమీకు అందించనుంది. సంస్థలో 330 స్పెషలిస్ట్ ఆఫీసర్పో స్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్సైట్ https://www.bankofbaroda.in/ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబందించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే మొదలవగా ఆగస్టు 19వ తేదీతో ముగియనుంది.
వయోపరిమితి:
పోస్టును బట్టి వయోపరిమితి మారుతుంది. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST అభ్యర్ధులకు 5 సంవత్సరాలు, OBC (నాన్-క్రీమీ లేయర్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, PwD అభ్యర్థులకు 10 నుంచి 15 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
వేతన వివరాలు:
పోస్టును బట్టి అభ్యర్థుల వేతనంలో మార్పు ఉంటుంది. అలాగే వసతి, వైద్య, ప్రయానాలకు సంబందించిన ఇతర అలవెన్సులు కూడా అందుతాయి.
దరఖాస్తు రుసుము:
జనరల్/EWS/OBC అభ్యర్థులు రూ.850, SC/ST/PwD/మహిళల అభ్యర్ధులు రూ.175 చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం:
ఏ పోస్టులకు సంబంధించి ఎంపిక రెండు విభాగాల్లో జరుగుతుంది. మొదటిది షార్ట్ లిస్టింగ్, రెండవది పర్సనల్ ఇంటర్వ్యూ
దరఖాస్తు ఇలా చేసుకోండి:
- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ https://www.bankofbaroda.in/ లోకి వెళ్ళాలి
- అందులో కెరీర్స్ విభాగంలో ప్రస్తుత అవకాశాలు ఆప్షన్ పై క్లిక్ చేయాలి
- తరువాత అప్లికేష లింక్ పై క్లిక్ చేయాలి
- వ్యక్తిగత వివరాలతో ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి
- లాగిన్ అయ్యి దరఖాస్తు ఫారంను ఫిల్ చేయాలి
- అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి
- దరఖాస్తు రుసుమును చెల్లించాలి
- తరువాత ఫారంను ప్రింట్ లేదా సేవ్ చేసుకోవాలి
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







