బహ్రెయిన్‌లో మేకప్ డ్రగ్ పార్శిల్ కేసు.. నిందితుడికి 15ఏళ్ల జైలుశిక్ష..!!
- August 13, 2025
మనామా: బహ్రెయిన్ లో భారీ డ్రగ్ నెట్ వర్క్ బయటపడింది. ఒక ప్రసిద్ధ కంపెనీలో డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్న ఒక ఆసియా వ్యక్తి అమెరికా నుండి మేకప్ షిప్‌మెంట్‌లో దాచిపెట్టిన గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. ఈ కేసును విచారించిన కోర్టు 15 సంవత్సరాల జైలు శిక్షతోపాటు, 5,000 దినార్ల జరిమానా విధించింది. జైలు శిక్ష పూర్తియిన తర్వాత అతడిని దేశం నుండి బహిష్కరించాలని ఆదేశించింది.
పోస్టల్ షిప్‌మెంట్‌ల ద్వారా డ్రగ్స్ ను అక్రమంగా రవాణా చేస్తున్న ఇంటర్నేషనల్ నెట్‌వర్క్‌లో అతను భాగమని దర్యాప్తులో తేలింది. ఏప్రిల్ 5న బహ్రెయిన్ ఎయిర్ పోర్టులో పార్శిల్‌ను సీజ్ చేశారు. అందులో మేకప్ వస్తువల మాటున దాచిన 1.016 కిలోల బరువున్న మూడు బ్యాగుల గంజాయిని గుర్తించారు. ఈ పార్శిల్ ను తీసుకునేందుకు వచ్చిన క్రమంలో నిందితుడిని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- సౌదీలో ఐస్‌క్రీమ్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- కువైట్ ఫ్రైడే మార్కెట్లో తనిఖీలు.. 61 మంది అరెస్ట్..!!
- మలేషియాలో వర్షంలోనూ అదరగొట్టిన గల్ఫ్ ఎయిర్ ఫ్లైపాస్ట్..!!
- ఖతార్‌లో పిల్లల డిజిటల్ భద్రతపై ప్రత్యేక దృష్టి..!!
- మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ఆడపడచుల నీరాజనాలు
- కజకిస్థాన్‌కు బయలుదేరిన ఒమన్ సుల్తాన్..!!
- నాటక రంగానికి పూర్వవైభవం:సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ స్కూళ్లలో ఫొటోలు, వీడియోలపై కొత్త నిబంధనలు..!!
- బిట్స్ పిలానీ–ఐఐటీ మద్రాస్ మధ్య ఐదేళ్ల భాగస్వామ్యం.. విద్యార్థుల ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్







